- ఆనందంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు?
- బిల్లులు పెట్టాలంటే ముట్టజెప్పాల్సిందేనని గుసగుసలు?
- పీజీ విద్యార్థులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రచారం?
Corruptions in Govt Hospital : ఆ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant ) హవా మాములుగా ఉండటంలేదట.ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ కంటే కూడా సదరు జూనియర్ అసిస్టెంటే పవర్ ఫుల్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆసుపత్రినంతా కూడా సదరు ఉద్యోగి తన కనుసన్నల్లోనే ఉంచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదట. బిల్లులు చేసే క్రమంలో తోటి ఉద్యోగులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.తరగతులకు హాజరుకాని పీజీ విద్యార్థులను ఒక్కొక్కరూ 30 వేలు చెల్లించాల్సిందేనని హుకుం జారిచేశాడని, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక లోలోపలే మదనపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతినెలా ఉద్యోగుల జీతాలు చేయాలన్నా సదరు జూనియర్ అసిస్టెంట్ కు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది.
రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన..
హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ(KU) కి ఎదురుగా ఉన్న టీబీ ఆసుపత్రి (TB Hospital) లో ఇటీవలే పదవీ విరమణ చేసిన నాలుగవ తరగతి ఉద్యోగిని ని సదరు జూనియర్ అసిస్టెంట్ మామూళ్ల (Corruptions)పేరుతో ఇబ్బందులు కు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో పూర్తి బిల్లులు చేయడానికి సదరు ఉద్యోగి 50 వేలు డిమాండ్ చేసినట్లు కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు మనమంతా ఒకే దగ్గర విధులు నిర్వహించాము, కాస్త చూడండి అని ఆమె బతిమిలాడుకున్న సదరు జూనియర్ అసిస్టెంట్ ససేమిరా అన్నట్లు కార్యాలయంలో ఉన్న ఉద్యోగులే మాట్లాడుకోవడం గమనార్హం.
Govt Hospital లో అసలేం జరుగుతుంది..?
హన్మకొండ జిల్లా(Hanmakonda District)లోని కాకతీయ యూనివర్సిటీ కి ఎదురుగా ఉన్న టీబీ ఆసుపత్రిలో వసూళ్ల పర్వం కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రిలోని ఓ జూనియర్ అసిస్టెంట్ అంతా తానై వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో సదరు జూనియర్ అసిస్టెంట్ వ్యవహారశైలిని గమనిస్తున్న తోటి ఉద్యోగులే ఆయన తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలియవచ్చింది. ప్రతి పనికి చేతివాటం ప్రదర్శిస్తున్న సదరు ఉద్యోగి, వృధా ఖర్చులు కూడా ఎక్కువగా పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.కార్యాలయంలో ఉన్న” చెక్ బుక్కే” అయిపోయిందంటే ఏస్థాయిలో తన హవా నడిపిస్తున్నాడో అర్ధంచేసుకోవచ్చని ఆసుపత్రిలోని ఉద్యోగులు చెవులుకొరుక్కుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Govt Hospital | ఆసుపత్రిలో ఉద్యోగి ఇష్టారాజ్యం?”