DA For TGSRTC Employees : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి 2.5 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల ( RTC employees) సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
DA For TGSRTC Employees : కలిగే ప్రయోజనాలు
ఉద్యోగులకు DA అనేది వారి జీవనోపాధికి సంబంధించిన కీలకాంశం. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 2.5 శాతం డీఏ (2.5 per cent Dearness Allowance (DA) పెంపు నిర్ణయం ఎంతో ప్రధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన 2.5 శాతం పెంపు ద్వారా ఆర్టీసీలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది. DA పెంపు తర్వాత దీనిని ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై లెక్కించి, వారి జీతాల్లో చేర్చనున్నారు. సాధారణంగా వేతన పునర్నిర్మాణం జరిగిన తర్వాత DA ను లెక్కిస్తారు. ఇది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా ఉంటుంది. ప్రతి నెలా రూ.3.6 కోట్లు RTC ఖర్చు చేయాల్సి వస్తుంది.
TGSRTC ఉద్యోగులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు
తమకు డీఏ (Dearness Allowance) పెంపుతోపాటు మరికొన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులు కొంతకాతంగా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఉద్యోగులకు వారి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఉద్యోగుల భద్రత కోసం ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు తదితర అంశాలను పునస్సమీక్షించాలని భావిస్తోంది.
TGSRTC ఆర్థిక పరిస్థితి.. భవిష్యత్ ప్రణాళికలు
ఆర్టీసీ ఉద్యోగుల DA పెంపుతో ఆ సంస్థపై నెలకు రూ.3.6 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే, ప్రభుత్వం RTC సేవలను బలోపేతం చేయడానికి పలు మార్గాలను అన్వేషిస్తోంది. ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు కొత్త రూట్లను పరిశీలిస్తోంది. బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రూట్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇప్పటికే డిజిటల్ టికెట్ సిస్టమ్, ఆన్‌లైన్ బుకింగ్ వంటి సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే యోచన కూడా ఉంది. దీని ద్వారా సంస్థకు ఇంధన వ్యయం తగ్గే అవకాశం ఉంది.
మహాలక్ష్మి పథకం ప్రభావం
మహాలక్ష్మి పథకం ( Mahalaxmi scheme) ద్వారా ఇప్పటికే 150 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి అదనపు భారం అయినప్పటికీ మహిళలకు ప్రయోజనం కలిగించేలా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదే క్రమంలో TGSRTC సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ పథకం వల్ల మహిళల రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా ఉద్యోగ, విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో వారికి మరింత వెసులుబాటు కలుగుతోందని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







