Daaku Maharaaj Chinni Song | తమన్, అనంత శ్రీరామ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సినీ గేయ రచయితల నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘చిన్ని’ అనే టైటిల్‌తో వచ్చిన సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. సింగర్ విశాల్ మిశ్రా అద్భుతంగా ఆలపించిన ఈ పాట.. బాలకృష్ణ (Nandamuri Balakrishna)పాత్ర, ఒక చిన్నారి ప్రధాన పాత్ర మధ్య ఉన్న అపురూపమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది. హిల్ స్టేషన్‌లోని సుందరమైన ప్రదేశాల మధ్య చిత్రీకరించబడిన ఈ పాట మనస్సులను హత్తుకుంటోంది.
ఇటు క్లాస్, అటు మాస్ ఆడియన్స్‌ని అలరించేలా రూపొందించిన పాటలతో సినిమాలో ఈ పాట మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. జనవరి 2025 మొదటి వారంలో, అద్భుతమైన బీట్స్‌తో కూడిన మాస్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాటను బాలయ్య, ఊర్వశి రౌటేల(Urvashi Rautela)పై చిత్రీకరించారు.
జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న డాకు మహారాజ్, దాని ట్రైలర్‌ను జనవరి 2వ తేదీన విడుదల చేయనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో బాబీ డియోల్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. నిర్మాత ఎస్ నాగ వంశీ, దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రం ‘విక్రమ్’ మరియు ‘జైలర్’ వంటి హిట్ చిత్రాలను అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Daaku Maharaaj Chinni Song ఇక్కడ చూడండి..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..