Sarkar Live

దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు

భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగ‌ల్లో దీపావ‌ళి (Deepavali )ఒక‌టి. ఈ ప‌ర్వ‌దినానికి అంతర్జాతీయ గుర్తింపు ల‌భించింది. యునెస్కో త‌న ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్ర‌కోట (Delhi’s Red Fort)లో జ‌రుగుతున్న

UNESCO

భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగ‌ల్లో దీపావ‌ళి (Deepavali )ఒక‌టి. ఈ ప‌ర్వ‌దినానికి అంతర్జాతీయ గుర్తింపు ల‌భించింది. యునెస్కో త‌న ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్ర‌కోట (Delhi’s Red Fort)లో జ‌రుగుతున్న UNESCO స‌ద‌స్సులోఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యునెస్కో తన అధికారిక X పేజీలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. భార‌తీయ సంస్కృతికి ప్ర‌తిబింబ‌మైన దీపావ‌ళికి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

అంతర్జాతీయ వేదికపై గొప్ప గుర్తింపు

యునెస్కో స‌ద‌స్సుకు ఈసారి భార‌త‌దేశం ఆతిథ్య‌మిచ్చింది. ఈనెల 8న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు 13 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అంతర్జాతీయ ప్రతినిధులు (international representatives ), ప్రముఖ అతిథులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోసం సుమారు 80 దేశాల నుంచి వ‌చ్చిన 67 ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌మిటీ (UNESCO panel) క్షుణ్ణంగా ప‌రిశీలిచింది. ఇందులో భాగంగానే భారతదేశం నుంచి సమర్పించిన దీపావళి పండుగను పరిశీలించి జాబితాలో చేర్చారు.

భార‌త‌దేశానికి మ‌రో అరుదైన గౌర‌వం

దీపావ‌ళిని యునెస్కో ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH)జాబితాలో చేర్చ‌డంతో భార‌త‌దేశం పేరు మ‌రోమారు ప్ర‌పంచ వేదిక‌పై అరుదైన గౌర‌వం పొందింది. ఇప్పటివరకు భారత్‌లోని 15 సంప్రదాయాలు యునెస్కో ఈ జాబితాలో చేర్చింది. కుంభామేళా (Kumbh Mela), కోల్‌కతా దుర్గా పూజ (Kolkata’s Durga Puja), గుజరాత్ గర్బా (Gujarat’s Garba), యోగా (Yoga), వేద పారాయణం (Vedic chanting), రామ్‌లీలా (Ramlila), రమ్మణ్ (Ramman), కూటియాట్టం (Kutiyattam) ఈ లిస్టులో ఇప్ప‌టికే చోటు సంపాదించుకున్నాయి. తాజాగా దీపావ‌ళికి ఆ గుర్తింపు ల‌భించింది.

ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ అంటే ఏమిటి?

Intangible Cultural Heritage అంటే అగోచర సాంస్కృతిక వారసత్వం. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే తరతరాలుగా ఒక సమాజం, సమూహం లేదా ప్రజలు కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, పండుగలు, జ్ఞానం, నైపుణ్యాలు, జీవన విధానాలు అన్న మాట. ఇవి భవనాలు, కోటలు, దేవాలయాలు వంటి కనిపించగలిగే వారసత్వం కాదు. మనుషుల జీవన విధానాలు, సంస్కృతి, ఆచార వ్య‌వ‌హారాల్లో జీవంతమైన సంప్రదాయాలు. దీపావళి, దుర్గాపూజ, కుంభమేళా వంటి పండుగులు, కూచిపూడి, కూటియాట్టం, యక్షగానం, వేద పారాయణం, జానపద గీతాలు వంటి సాంప్రదాయ కళలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, పూజా విధానాలు, ఆచారాలు, చేతివృత్తులు, సంప్రదాయ కళాకారుల నైపుణ్యాలు, హస్తకళలు, జానపద కథలు, ప్రజల జీవనశైలి, జ్ఞానం, నమ్మకాలు.. ఇవ‌న్నీ Intangible Cultural Heritage కోవ‌కే వ‌స్తాయ‌న్న‌మాట. కల్లోలంగా కనిపించే వస్తువులు కాదు కాబట్టి మాటల్లో, పాటల్లో, ప్రవర్తనల్లో, సంస్కృతిలో ఇవి జీవిస్తాయి.
తరతరాలుగా చెబుతూ, చూపిస్తూ, నేర్పిస్తూ కొనసాగిస్తారు. అందుకే వీటిని ‘అమూర్త’ లేదా ‘అగోచర’ సాంస్కృతిక వారసత్వం అంటారు. ఆంగ్లంలో Intangible Cultural Heritage అని పిలుస్తారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?