డయాబెటిస్ (Diabetes) వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Control) అదుపులో ఉంచుకోకపోతే, అది మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే, షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం తాము తీసుకుంటున్న ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. మీరు తీసుకునే ఆహారాన్ని ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఆహార (Diabetes Diet) ఉన్నాయి. మీరు తినే ఆహారంలో పిండి పదార్థాలు చాలా ముఖ్యమైనవి. డయాబెటిస్ ఉన్నవారికి ఉత్తమమైన కొన్ని పిండి పదార్థాల గురించి తెలుసుకోండి..

బాదం పిండి
ఇది మెత్తగా రుబ్బిన బాదం (Almond Flour) నుంచి తయారవుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది గ్లూకోజ్ శోషించుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar ) స్థిరీకరించడానికి ఈ బాదం పిండి సహాయపడుతుంది.

శనగ పిండి (Chickpea Flour)
Diabetes Diet : శనగ పిండి లేదా బేసన్ ఒక మోస్తరు GI కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.

ఇది బార్లీ గింజల పొడి తక్కువ GI కలిగి ఉంటుంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యపరంగా మంచి చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది గ్లూకోజ్ జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

ఓట్ పిండి (Oat Flour) : ఓట్స్ పిండి బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికి మితమైన GI ఉంటుంది.

కొబ్బరి పిండి (Coconut Flour): పిండి రకాల్లో అత్యధిక ఫైబర్ ఉన్నవాటిలో ఒకటి, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ GI ఉంటుంది. వంటల్లో దీని ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.