Sarkar Live

పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission

Document-free admission : రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు మంచి విద్యను పొందే హక్కు కలిగి ఉన్నాడ‌ని అంటోంది ప్ర‌భుత్వం. ఏ కారణం చేతనైనా, చిన్నారులు విద్యకు దూరం కావ‌ద్ద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Document-free admission

Document-free admission : రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు మంచి విద్యను పొందే హక్కు కలిగి ఉన్నాడ‌ని అంటోంది ప్ర‌భుత్వం. ఏ కారణం చేతనైనా, చిన్నారులు విద్యకు దూరం కావ‌ద్ద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ (Aadhar not mandatory) లేదా జనన సర్టిఫికెట్ (Birth certificate not needed) లాంటి ప‌త్రాలు లేకున్నా పిల్లలను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవాల‌ని (Document-free admission) యాజ‌మాన్యాల‌కు (Education Department order) ఆదేశాలు జారీ చేసింది.

పత్రాలు లేవని చెప్పి ప్రవేశం నిరాకరించొద్దు

చాలా స్కూళ్లలో… ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలకు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, TC వంటి పత్రాలు లేకపోతే అడ్మిషన్ (:(School admissions) ఇవ్వడం లేదు. దీని వల్ల ఎక్కువగా వలస కూలీలు (Migrant workers’ children), నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు వంటి వారి పిల్లలు చ‌దువుకు దూర‌మ‌వుతున్నారు. వీరి కుటుంబాలు తరచూ ఒకచోటునుంచి మరోచోటుకు మారుతుంటాయి. ఈ మార్పుల్లో పత్రాలు పోవడం, తీసుకురాలేకపోవడం స‌ర్వ‌సాధార‌ణం. ఈ కారణంగా చిన్నారులు చదువు పట్ల ఆసక్తి ఉన్నా అడ్మిషన్ దొరకక చ‌దువలేక పోతున్నారు. ఈ సమస్యపై వచ్చిన ఫిర్యాదులు పెరగడంతో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. పత్రాలు లేవని చెప్పి ప్ర‌వేశం ఇవ్వకపోవడం పూర్తిగా తప్పని (No denial of admission) స్పష్టం చేసింది.

Right to Education Act ఏమంటోంది?

రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం (Right to Education Act) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్ల‌ల‌కు ఉచితం నిర్బంధ విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత. పత్రాలు లేవని కారణం చూపి ఒక్క చిన్నారిని కూడా చదువుకు దూరం చేయొద్దు. స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌, హెడ్‌మాస్టర్లు ఈ నిబంధనను క‌చ్చితంగా పాటించాలని విద్యాశాఖ మరోసారి గుర్తు చేసింది.

ముందు అడ్మిష‌న్లు ఇవ్వండి

దేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లే కార్మికుల పిల్లలు ఎక్కువగా చదువు దూరమవుతున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డ్ లేదా జనన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేక‌పోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కొన్నిసార్లు వీరు పుట్టిన రాష్ట్రం, పెరిగిన ప్రదేశం వేరు కావచ్చు. ఈ కారణాలతో స్కూల్‌ అడ్మిషన్లలో ఎదురయ్యే సమస్యలపై ప్రభుత్వం ఫోక‌స్ పెట్టింది. వలస కుటుంబాల పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పత్రాలు లేకున్నా వెంటనే ప్రవేశం ఇవ్వాల‌ని, పత్రాలు తర్వాత సమర్పించుకోవచ్చ‌ని స్పష్టం చేసింది. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్కూల్‌ యాజమాన్యం పిల్లలకు ముందుగా తాత్కాలిక ప్రవేశం (Provisional Admission) ఇవ్వాలి. పత్రాలు ఉంటే సరి, లేకపోతే తర్వాత సమర్పించేందుకు సమయం ఇవ్వాలి. స్కూల్ స్టాఫ్ అదనంగా తల్లిదండ్రులకు సహాయం చేసి, ఆధార్ రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల దరఖాస్తుల్లో మార్గదర్శనం చేయాలని కూడా సూచించింది.

TC ఇవ్వ‌డంలో జాప్యం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

కొన్ని స్కూళ్లలో TC (Transfer Certificate) ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. దీని వల్ల పిల్లలు కొత్త స్కూల్‌ లో అడ్మిషన్‌ మిస్ అవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా స్పందించింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే, సంబంధిత శాఖ అధికారులు క‌ఠిన‌ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. TC ఒక స్కూల్‌ నుంచి మరొక స్కూల్‌కు వెళ్లే చిన్నారులకు అత్యంత ముఖ్యం. ఈ ప్రక్రియను వేగంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని సూచించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?