Sarkar Live

Elephant Attack | భక్తులపై ఏనుగుల దాడి .. ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

Three die in Elephant Attack : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లా ( Annammaiah district) ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం గుండ‌కోణ గ్రామంలో ఈ రోజు ఉద‌యం ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శివాల‌యానికి వెళ్తున్న భ‌క్తుల (group of devotees)పై అడ‌వి

Elephant Attack in Ap

Three die in Elephant Attack : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లా ( Annammaiah district) ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం గుండ‌కోణ గ్రామంలో ఈ రోజు ఉద‌యం ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శివాల‌యానికి వెళ్తున్న భ‌క్తుల (group of devotees)పై అడ‌వి ఏనుగులు దాడి చేశాయి. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

అడ‌వి మార్గంలో ప్ర‌యాణిస్తుండ‌గా..

గ్రామస్థుల కథనం ప్రకారం… బాధితులు వై.కోట గ్రామానికి చెందినవారు. ప్రతి ఏటా మహాశివరాత్రి (Maha shivaratri) సంద‌ర్భంగా శివాలయం (shiva temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు గుండలకొణకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ప‌లువురు భక్తులు గుండలకొణ శివాలయానికి బయల్దేరారు. అడవి మార్గంలో వారు ప్రయాణిస్తుండగా అటుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు దాడికి దిగింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి తరలించారు. వీరి ప‌రిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Elephant attack incident : పరిస్థితిని స‌మీక్షిస్తున్న అధికారులు

ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగానే అట‌వీ శాఖ అధికారులు అన్న‌మ‌య్య జిల్లా క‌లెక్ట‌ర్‌కు స‌మాచారం అందించారు. అనంత‌రం అధికారులు అక్క‌డికి చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షించారు. భక్తులకు భద్రతా చర్యలు చేపట్టారు. ఫారెస్టు అధికారులు ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. భక్తులు అడవి మార్గాల నుంచి ప్రయాణించకుండా ప్రత్యేక సూచనలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

భ‌క్తుల‌పై ఏనుగుల దాడి ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా (ex gratia) ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ. 5 ల‌క్ష‌లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఇలాంటివి పున‌రావృతం కాకుండా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్నారు.

గతంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు

Elephant Attack in AP గుండలకొణ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఏనుగుల సంచారం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో శివాలయానికి వెళ్లే సందర్భాల్లో అడవి మీదుగా ప‌ర్య‌టిస్తుండ‌గా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అధికారులు చుట్టుప‌క్క‌ల గ్రామస్థుల‌ను, శివాల‌యానికి వెళ్లే భ‌క్తుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోసారి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అడవి ఏనుగుల బెడద పెర‌గ‌డం, మ‌నుషుల‌పై అవి దాడులు చేయ‌డంతో బిక్క‌బిక్కుమంటున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో పొలాలను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయని రైతులు అంటున్నారు. ఫారెస్టు అధికారులు ఇప్ప‌టికైనా స్పందించి ఏనుగులను ఆ అడ‌వి ప్రాంతం నుంచి త‌ర‌లించాల‌ని గ్రామ‌స్థులు కోరుతున్నారు. క‌ట్టుదిట్ట‌మైన‌ భద్రతా చర్యలు చేపట్టి భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అంటున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?