Sarkar Live

ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం! వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder

సామాన్యుడి ప్రాణాలతో చెలగాటం! Adulterated Chili Powder | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన ఎనుమాముల మార్కెట్ (Enumamula market) ఇప్పుడు కల్తీ మాఫియాకు అడ్డాగా మారి సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. వంటలకు రుచిని ఇచ్చే కారం

Adulterated Chili Powder

సామాన్యుడి ప్రాణాలతో చెలగాటం!

Adulterated Chili Powder | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన ఎనుమాముల మార్కెట్ (Enumamula market) ఇప్పుడు కల్తీ మాఫియాకు అడ్డాగా మారి సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. వంటలకు రుచిని ఇచ్చే కారం పొడి.. ఇప్పుడు ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. పదుల సంఖ్యలో వెలిసిన కారం మిల్లులు యథేచ్ఛగా కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి.

తొడిమలే ‘ముడి’ సరుకు.. తాలుకాయలే ‘బలం’!

సాధారణంగా నాణ్యమైన మిర్చిని వేరు చేసిన తర్వాత వచ్చే తాలు (పనికిరాని మిర్చి), మిర్చి తొడిమెలు, బూజు పట్టిన గింజలను ఈ కల్తీ రాయుళ్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. వీటిని పొడి చేసి, దానికి ఆకర్షణీయమైన ఎరుపు రంగు రావడానికి ప్రమాదకరమైన సింథటిక్ రంగులు (Synthetic Colors),చూడటానికి ఎర్రగా, నిగనిగలాడుతూ కనిపించే ఈ కారం పొడి (Adulterated Chili Powder) ని చూసి సామాన్య ప్రజలు మోసపోతున్నారు.

దాడులు జరుగుతున్నా ఆగని ‘దందా’!

టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా దాడులు నిర్వహిస్తున్నా, వేల క్వింటాళ్ల కల్తీ కారాన్ని సీజ్ చేస్తున్నా ఈ మాఫియా తీరు మారడం లేదు. అధికారులు దాడులు చేసినప్పుడు మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నా, కొద్దిరోజులకే వారు బయటకు వచ్చి మళ్ళీ అదే దందాను మొదలుపెడుతున్నారు.ఏనుమాముల శివారు ప్రాంతాల్లోని మిల్లుల్లో రాత్రి సమయాల్లో ఈ కల్తీ ప్రక్రియ సాగుతోంది.

యాక్షన్ ప్లాన్ ఎక్కడ సర్​?

దాడులు కేవలం హడావుడికే పరిమితం కాకుండా, కల్తీకి పాల్పడే మిల్లుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎనుమాముల మార్కెట్ పరిసరాల్లోని ప్రతి మిల్లుపై నిఘా ఉంచి, నిరంతరం తనిఖీలు చేపడితేనే ఈ కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

Adulterated Chili Powder : ఈ ‘కారం’ తింటే కష్టమే!

క్యాన్సర్ కారకాలు: కారానికి ఎరుపు రంగు రావడానికి వాడే ‘సుడాన్ రెడ్’ (Sudan Red) వంటి సింథటిక్ రంగులు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి శరీరంలో చేరితే కాలక్రమేణా క్యాన్సర్‌కు దారితీస్తాయి ఇటుక పొడి, చెక్క పొడి, తవుడు కలపడం వల్ల జీర్ణకోశ వ్యాధులు రావడమే కాకుండా, కాలేయం (Liver), కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి.కల్తీ కారం తిన్న వెంటనే కడుపులో మంట, అల్సర్లు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?