Sarkar Live

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

క‌ల్తీ క‌ల్లు, గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్

jupally krishna rao Illegal Liquor

క‌ల్తీ క‌ల్లు, గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగం ప‌నితీరుపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్షించారు. అక్ర‌మ‌, క‌ల్తీ మ‌ద్యం, క‌ల్తీ క‌ల్లు, డ్ర‌గ్స్, గంజాయి, ఇత‌ర మాద‌క‌ద్ర‌వ్యాల విక్ర‌యం, ర‌వాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చ‌ర్ల‌ప‌ల్లి ప్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ ముడి స‌రుకు త‌యారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగ‌తి, శిక్ష‌ల రేషియో, పాత నేర‌స్తుల‌, నిందితుల‌పై నిఘా, త‌దిత‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు.

అక్రమ మద్యాన్ని(Illegal Liquor) , గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న‌వారిని వెంట‌నే గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని ఆదేశించారు. డ్ర‌గ్స్, సింథ‌టిక్ డ్ర‌గ్స్, గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా, క‌ల్తీ క‌ల్లు అమ్మ‌కాల‌పై నిరంత‌ర‌ నిఘా, విస్తృత త‌నిఖీల‌ను చేప‌ట్టాల‌న్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని మంత్రి ఆదేశించారు. నిఘాను కేవలం చెక్కు పోస్టులకే పరిమితం కాకుండా ఆయా గ్రామాల్లోని ఇతర మార్గాలు, సోర్సులపై కూడా నిఘాను ముమ్మరం చేసి దీనిలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గీతకార్మికుల కోసం కొత్త ప్రణాళిక

మంత్రి మాట్లాడుతూ గోవా, మధ్యప్రదేశ్‌లో సంప్రదాయ మద్యం బ్రాండింగ్ చేసి అమ్ముతున్నట్టు, తెలంగాణలో కూడా ఈత, తాటి కళ్లును టొడి నేచురల్ బ్రూవరీ రూపంలో బాట్లింగ్ చేసి అమ్మితే గీతకార్మికులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఎక్సైజ్ శాఖ అధికారుల‌కు ఆయ‌ధాలు అప్ప‌గించే అంశంలో నిబంధ‌న‌లు ఏం చెప్పుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు ఏంటీ? ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్క‌డైనా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు అప్ప‌గించారా? దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేసి సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, నాటుసారా తయారీ అమ్మకాలు, కల్తీ మద్యం తయారీతో పాటు ఎన్డీపీఎస్ యాక్టు క్రింద కేసులు నమోదు చేయడమే కాకుండా, నమోదు చేసిన కేసుల్లో ఎంత‌మంది నిందితుల‌కు పడుతున్నాయి? అని ఆరా తీశారు. కేసు న‌మోదు, పంచానామా నుంచి చార్జిషీట్ దాఖ‌లు, ట్ర‌య‌ల్ సంద‌ర్భంలో స‌మ‌ర్ద‌వంతంగా వాద‌న‌లు వినిపించి నిందితుల‌కు శిక్ష‌లు ప‌డే వ‌ర‌కు విశ్ర‌మించ‌కుండా ప‌ని చేయాల‌ని సూచించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?