friends with benefits rental offers : కెనడా (Canada)లో అద్దె ఇంటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు (International students) భరించలేనంతగా విపరీతంగా అక్కడ రెంట్లు పెరగాయి. దేశం కాని దేశంలో చదువుకోవడానికి వచ్చిన వారికి తక్కువ అద్దెకు కనీస సౌకర్యాలు ఉన్న రూమ్ దొరకడం కెనడాలో కష్టమే. ఈ నేపథ్యంలో తమకు అనువుగా ఉన్న గదిని విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా అన్వేషిస్తుండగా వారిని కొన్ని అనైతిక ప్రకటనలు (rental advertisements) ఆకర్షిస్తున్నాయి.
దిక్కుతోచని స్థితిలో దిక్కుమాలిన ఆఫర్లు
విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని కొందరు హౌస్ ఓనర్లు వారికి అసభ్యకరమైన ఆఫర్లు (rental offers) ఇస్తున్నారు. ముఖ్యంగా “ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్” అనే ప్రకటనల ద్వారా మహిళా విద్యార్థులను ట్రాప్ చేసి లైంగిక సంబంధానికి ఒప్పిస్తున్నారు. ఇల్లు దొరకని స్థితిలో ఉన్న విద్యార్థినులు ఇలాంటి దిక్కుమాలిన ఆఫర్లకు తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వస్తోంది.
సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వల
కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రధానంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా గదులు వెతుకుతారు. వీరి కోసం కొందరు హౌస్ ఓనర్లు అనైతిక, అసభ్యకరమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారని CBC న్యూస్ పరిశీలనలో తేలింది. అలాంటి ప్రకటనల్లో కొన్ని ఈ విధంగా ఉన్నాయి…
- Seeking Live-in GF (Toronto) – అంటే ఉచిత గదికి బదులుగా లైంగిక సంబంధం ఏర్పర్చుకోవాలి.
- Friends with benefits, no rent required – అద్దె చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓనర్ కోరినట్టు అనైతిక సంబంధం ఏర్పర్చుకోవాలి.
- Room available for female students with extra benefits – ఇది కూడా స్పష్టంగా అనైతిక ప్రవర్తనను సూచించే ప్రకటన.
ఈ యాడ్స్ సామాజిక మాధ్యమాలు, క్లాసిఫైడ్ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ గ్రూప్స్, ఇతర నకిలీ హౌసింగ్ పోర్టల్స్‌లో విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక బలహీనతను ఆసరా చేసుకొని friends with benefits rental offers
కెనడాలో విదేశీ విద్యార్థినులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రకటనల (rental advertisements) వలలో పడుతున్నారు. తక్కవ రెంట్లకు సరైన గదులు దొరకకపోవడంతో ఇలాంటి అనైతిక ఆఫర్ల (friends with benefits rental offers)కు లొంగిపోవాల్సి వస్తోంది. ఉచితంగా గది, భోజనం, మరికొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో విద్యార్థినులు వీటికి అంగీకరించాల్సి వస్తోంది. హౌస్ ఓనర్లు వీరి ఆర్థిక బలహీనతను ఉపయోగించుకొని లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత సెక్స్ ట్రాఫికింగ్‌లోకి లాగుతున్నారు. స్టూడెంట్స్‌ను బెదిరించి మరింత ప్రమాదకరమైన వృత్తిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థినులు దీని నుంచి బయట పడాలన్నా సాధ్యం కాని పరిస్థితులు సృష్టిస్తున్నారు. నువ్వు ఇలా బయటకు వెళ్తే నీ వీసా క్యాన్సిల్ అవుతుంది అంటూ హౌస్ ఓనర్లు బెదిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థినులు హౌస్ ఓనర్లకు లొంగిపోయి ఆ ఇంట్లోనే గడపాల్సి వస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








