పసిడి మార్కెట్‌లో స్వల్ప పతనం
Gold Price Today | న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు, ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పట్టుతున్నాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
నవంబర్ 24న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, ఇప్పుడు అది రూ.1,25,120కి తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,25,660, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,190గా ఉంది. వెండి కిలో ధర అక్కడ రూ.1,70,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
ముంబై, దిల్లీ, హైదరాబాద్, తిరువనంతపురం(కేరళ), విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రూ.1,25,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర సగటున రూ.1,14,690 చుట్టూ ఉంది. వెండి ధరలు మాత్రం నగరాన్ని బట్టి రూ.1,62,900 నుండి రూ.1,70,900 వరకు మారుతున్నాయి.
కాగా బంగారం, వెండి ధరలు ప్రతి నగరంలో ఒకేలా ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్థానిక డిమాండ్, స్టాక్ అందుబాటు, పన్నులు తదితర కారణాల వల్ల రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవాలంటే 8955664433 కు మిస్డ్‌కాల్ ఇవ్వవచ్చు. ఇక్కడ పేర్కొన్న ధరలు రోజంతా మారే అవకాశాలున్నందున కొనుగోలుదారులు ప్రత్యక్ష మార్కెట్‌ను చెక్ చేయడం మంచిది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







