Gold rates : హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold rates) ఆకాశాన్ని (skyrocketed ) అంటాయి. వారం రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి చివరి రోజుల్లోనే పలు సార్లు ఆల్ టైమ్ హైరికార్డులను బ్రేక్ (broke all-time high records multiple times) చేసిన రేట్లు ఏప్రిల్ 1 నాటికి మరింత పెరిగాయి. 22 క్యారెట్ బంగారం ధర రూ. 85,100 కు, 24 క్యారెట్ బంగారం ధర రూ. 92,840 కు చేరింది. ఒక్క రోజులోనే 22 క్యారెట్ ధర రూ. 850, 24 క్యారెట్ ధర రూ. 930 పెరిగాయి. మార్చి 31 నాటికి 22 క్యారెట్ ధర రూ. 84,250, 24 క్యారెట్ ధర రూ. 91,910 గా ఉండగా వాటిని మళ్లీ అధిగమించింది.
వారం రోజుల వ్యవధిలోనే..
మార్చి 26 నాటికి 22 క్యారెట్ బంగారం ధర రూ. 81,950, 24 క్యారెట్ బంగారం రూ. 89,400 ఉండగా, ఒక్క వారం రోజుల్లోనే 2.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 22 క్యారెట్ బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ బంగారం ధర రూ. 78,000 ఉండగా, ఇప్పటి వరకు మొత్తం 19 శాతం పెరుగుదల 19 percent increase 19 percent increase) నమోదైంది. హైదరాబాద్ (Hyderabad) మాత్రమే కాకుండా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.
Gold rates : పెరుగుదలకు కారణాలు ఇవే..
బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా (safe-haven investment) చాలా మంది భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వాణిజ్య, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం కొనుగోలును పెంచారు. ఇదిలా ఉండగా అమెరికా, భారత్ వాణిజ్య వివాదం రాజుకుందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కొత్త టారిఫ్ విధించే యోచనలో ఉన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం టారిఫ్ విధించిందని, ఇతర దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నాయని ఆరోపించారు. దీనికి ప్రతిగా అమెరికా ఏప్రిల్ 2 నుంచి reciprocation టారిఫ్ విధించబోతోంది. ఇది బంగారు ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు, యూరప్ ఆర్థిక పరిస్థితులు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
భవిష్యత్ ధరలపై అంచనాలు
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బంగారం ధరలు (Gold rates In future) మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్యపరమైన మార్పులు, ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై బంగారం ధరలు ఆధారపడతాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఈ మార్పులను గమనిస్తూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..