Gopi Chand next movie : టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ (Gopi Chand) వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా హిట్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్లతో పని చేస్తున్నా కూడా హిట్టును అందుకోలేకపోతున్నాడు. శ్రీనువైట్ల(Srinu vaitla) డైరెక్షన్లో భారీ అంచనాలతో వచ్చిన విశ్వం మూవీ కూడా నిరాశపరిచింది. ఇప్పుడు పాత కాంబోలో ఓ కొత్త మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శ్రీనువైట్ల తో మూవీ అంటే పూర్తిగా ఫన్ జోనర్ లోనే ఉంటుంది కాబట్టి గోపీచంద్ కు హిట్టు పడుతుందనుకున్నారు. కానీ శ్రీనువైట్ల రేంజ్ లో మూవీ లేకపోవడం.. స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం.. కామెడీ కూడా మామూలుగానే ఉండడంతో ఆడియన్స్ ఆదరించలేకపోయారు. కానీ అంతకంటే ముందు వచ్చిన శ్రీను వైట్ల మూవీస్ కంటే ఈ మూవీ కొద్దిగా బెటర్ గా ఉందని టాక్ మాత్రం వచ్చింది. గోపీచంద్ కు కూడా ఈ మూవీతో కామెడీని బాగానే పండించాడని పేరు వచ్చింది.
టాలెంటెడ్ డైరెక్టర్ తో Gopi Chand
ఆ తర్వాత గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ ఘాజి మూవీ ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి (Sankalp reddy) డైరెక్షన్లో ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు. ఫ్యాన్స్ అంతా గోపీచంద్ ఈ మూవీతో కచ్చితంగా హిట్టు అందుకుంటారనే నమ్మకంతోనే ఉన్నారు. దీనికి కారణం సంకల్ప్ రెడ్డి ట్రాక్ రికార్డు. ఘాజి సినిమాతో అందరిని తనవైపు తిప్పుకున్న సంకల్ప్ ఆ తర్వాత చేసిన అంతరిక్షం మూవీ తో కూడా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. డిఫరెంట్ స్టోరీ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు.
కమ్ బ్యాక్ మూవీ అవుతుందా..?
ఇక గోపీచంద్ తో మూవీ తీస్తున్నాడు అంటే అది మంచి స్టోరీ అయి ఉంటుందని, ప్రజెంటేషన్ కూడా థ్రిల్లింగ్ గా ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడిపోయారు.ఈ మూవీ షూటింగ్ నడుస్తుండగానే గోపీచంద్ మరో సినిమాను ప్రారంభించాడు. ఈసారి ఒక కొత్త దర్శకుడు తో ప్రయాణం చేయబోతున్నారు. డైరెక్టర్ కొత్తవాడు అయినా కాంబినేషన్ మాత్రం పాతదే. ఆల్రెడీ చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్లో వచ్చిన సాహసం మూవీని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలోనే ఈ మూవీ తెరకెక్కుతోంది. సాహసం (sahasam) మూవీకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి కూడా పనిచేయబోతున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసిన గోపీచంద్ కి హిట్లు పడతాయేమో చూడాలి. మేకర్స్ మాత్రం ఈ మూవీలో వచ్చే డైలాగ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను మెప్పిస్తాయని ధీమాతో చెబుతున్నారు. కుమార్ సాయి(Kumar sai) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి దినేష్(Meenakshi dinesh) హీరోయిన్ గా నటిస్తోంది. మిగితా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఏదేమైనా గోపీచంద్ మొదలెట్టిన ఈ రెండు మూవీస్ కూడా సూపర్ హిట్ అయి గోపీచంద్ కి కం బ్యాక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.