Sarkar Live

Handloom Awards | చేనేత‌ల‌కు అవార్డుల ప్ర‌దానం.. గడువు లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

Handloom Awards : తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి పురస్కారాల (Konda Laxman Bapuji Handloom Awards)ను ప్రకటించింది. హస్తకళ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులు, డిజైనర్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను

Handloom Awards

Handloom Awards : తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి పురస్కారాల (Konda Laxman Bapuji Handloom Awards)ను ప్రకటించింది. హస్తకళ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులు, డిజైనర్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోనున్నారు. జాతీయ హస్తకళా దినోత్సవం (National Handloom Day) సందర్భంగా 2025 ఆగస్టు 7న ఈ పురస్కారాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌దానం చేయ‌నుంది. హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు దీని ద్వారా జీవనం సాగిస్తున్న వారిని గౌరవించేందుకు ఈ అవార్డుల‌ను ప్ర‌తి ఏడాది అందిస్తోంది.

Handloom Awards : ద‌ర‌ఖాస్తుకు గ‌డువు

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అవార్డుల కోసం ప్ర‌భుత్వం (The government of Telangana) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. హ‌స్త‌క‌ళ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వారిని ఈ పుర‌స్కారాల‌కు ఎంపిక చేస్తారు. అవార్డు కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని అర్హతలను ఖరారు చేశారు. చేనేత కార్మికులైతే 2024 డిసెంబరు 31 నాటికి 30 ఏళ్ల వ‌య‌సు పూర్తి చేసుకొని ఉండాలి. సంబంధిత వృత్తిలో ప‌దేళ్ల అనుభ‌వం క‌లిగి ఉండాలి. డిజైన‌ర్లు 2024 డిసెంబ‌రు నాటికి 25 ఏళ్ల వ‌య‌సు పూర్తి చేసుకొని, ఐదేళ్ల అనుభ‌వం క‌లిగి ఉండాలి. ద‌ర‌ఖాస్తుల‌ను 2025 ఏప్రిల్ 15లోగా హ‌స్త‌క‌ళ అండ్ టెక్స్‌టైల్స్ జిల్లా స‌హాయ సంచాల‌కుల (Department of Handlooms & Textiles)కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు…

ఈ అవార్డుల ద్వారా హస్తకళ రంగాన్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు, యువతను ఈ రంగంలోకి తీసుకురావడం సులభమవుతుంది. ఒకసారి ఈ అవార్డును అందుకున్న తర్వాత, వారికి మార్కెట్‌లో మరింత గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ మద్దతుతో ఈ రంగాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే అవకాశాలు పెరుగుతాయి.

హ‌స్త‌క‌ళా రంగాన్ని ప్రోత్స‌హించేందుకే Handloom Awards

హస్తకళ ఉత్పత్తులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ప్రధాన రంగం. దీన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఎంతో ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ అవార్డుల కార్యక్రమం దేశవ్యాప్తంగా హస్తకళ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?