Sarkar Live

తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్త‌య్యింది. తీవ్ర చ‌లి (Cold)ని కూడా లెక్క చేయ‌కుండా ఓట‌ర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం

Gram panchayat elections

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్త‌య్యింది. తీవ్ర చ‌లి (Cold)ని కూడా లెక్క చేయ‌కుండా ఓట‌ర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు (Senior citizens) ఉదయం నుంచే క్యూక‌ట్టారు.

56,19,430 మంది ఓటర్లు.. 37,562 పోలింగ్ కేంద్రాలు

మొద‌టి విడ‌త పంచాయ‌తీ (Gram panchayat elections) ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు అభ్య‌ర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు ఉండ‌గా 37,562 పోలింగ్ కేంద్రాలు (Polling stations) ఏర్పాటు అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొన‌సాగింది. అనంతరం 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ Gram panchayat elections

మొదటి దశలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ (Election notification) వెలువడింది. వీటిలో 5 గ్రామ పంచాయతీలకు, 169 వార్డు సభ్యుల స్థానాలకు మాత్రం ఎలాంటి నామినేషన్లు (Nominations) దాఖలు కాలేదు. మరోవైపు పోటీ లేకుండానే 396 మంది సర్పంచ్‌, 9,633 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంఖ్యలు గ్రామస్థాయిలో సమూహ నిర్ణయాల ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. ఎన్నికల భద్రతా ఏర్పాట్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 3,461 కేంద్రాలను సెన్సిటివ్‌గా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత చ‌ర్య‌ల కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. దాదాపు 50 వేల‌ మంది పోలీస్ సిబ్బంది, 60 ప్రత్యేక పోలీస్ ప్లాటూన్లు, అలాగే అగ్నిమాపక శాఖ, అటవీ శాఖలకు చెందిన 2 వేల‌ మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ శాంతియుతంగా సాగేందుకు వీరు అన్ని ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు.

స‌మ‌ర్థ‌మైన ఏర్పాట్లతో పోలింగ్‌

ఈ ఎన్నికలు గ్రామీణ అభివృద్ధి, స్థానిక పాలన, గ్రామస్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే గ్రామ ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచటానికి ఓటు వేయడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. గ్రామాల అభివృద్ధి దిశలో కీలకమైన ఈ మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రజల ఉత్సాహం, అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు సమర్థంగా సాగాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?