Sarkar Live

Guillain Barre Syndrome | హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసు

Guillain Barre Syndrome case in Hyderabad | భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌రం పెడుతున్న గులియన్-బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. కొత్త‌గా తెలంగాణ‌లోనూ దాపురించింది. తాజాగా హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు

Guillain Barre Syndrome

Guillain Barre Syndrome case in Hyderabad | భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌రం పెడుతున్న గులియన్-బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. కొత్త‌గా తెలంగాణ‌లోనూ దాపురించింది. తాజాగా హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు ఈ అరుదైన‌ వ్యాధి (Guillain Barre Syndrome) నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తున్నారు.

భారతదేశంలో GBS కేసులు

భార‌త‌దేశంలో గులియ‌న్‌-బారే సిండ్రోమ్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్రగా ఇవి అత్య‌ధికంగా న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ 130 కేసులు న‌మోద‌య్యాయి. పూణె, సోలాపూర్ త‌దిత‌ర‌ జిల్లాల్లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించారు. బాధితుల్లో ఇద్దరు ఇప్ప‌టికే మృతి చెందారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

అవ‌గాహ‌న అవ‌స‌రం

గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీని ప్రారంభ లక్షణాలను గుర్తించి సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

Guillain Barre Syndrome అంటే ఏమిటి?

గులియన్-బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome – GBS) అనేది ఒక అరుదైన వ్యాధి. నాడీ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపే రుగ్మ‌త‌. రోగనిరోధక వ్యవస్థను ఇది దెబ్బ‌తీస్తుంది. ఇది సాధారణంగా ఒక వైరల్‌ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ‌ల్ల సంభవిస్తుంది. ఈ వ్యాధి కారణంగా నరాలు దెబ్బతిని, కండరాలు బలహీనమైపోతాయి. లేదా పూర్తిగా పక్షవాతం రావచ్చు. ఇది ఒక తాత్కాలిక వ్యాధి అయినప్పటికీ దీని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. కొన్ని తీవ్రమైన కేసుల్లో ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీసి వెంటిలేటర్‌పై చికిత్స అవసరం కావచ్చు.

GBS వ్యాధి ఎలా వస్తుంది?

గులియన్-బారే సిండ్రోమ్ (GBS) రావ‌డానికి క‌చ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల బారినప‌డ్డ తర్వాత ఇది దాడి చేస్తుంద‌ని వైద్య నిపుణులు గుర్తించారు.
COVID-19, ఇన్‌ఫ్లూయోంజా, డెంగీ వంటి వైరస్‌లు GBS రిస్క్‌ను పెంచుతాయ‌ని అంటున్నారు. Campylobacter jejune అనే బాక్టీరియా GBS కి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇది కలుషిత‌ ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంద‌ని క‌నుగొన్నారు. కొన్ని వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తులకు GBS వచ్చే అవకాశముంటుంద‌ని కూడా వైద్య నిపుణులు అంటున్నారు. అయితే.. ఇది చాలా అరుదుగా జరుగుతుంద‌ని తెలిపారు.

Guillain Barre Syndrome ఎవ‌రికి రావ‌చ్చు?

Guillain Barre Syndrome ఎవ‌రికైనా రావ‌చ్చు. అయితే.. ప్ర‌ధానంగా 50 ఏళ్లు పైబ‌డిన వారు ఎక్కువ‌గా దీని బారిన ప‌డుతున్నారు. మధుమేహం, రక్తపోటు, ఇమ్యూన్ డిఫిషియెన్సీ ఉన్నవారికి ఈ వ్యాధి వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ ఉంద‌ని తెలుస్తోంది. దీన్ని ప్రారంభ దశలో గుర్తించి, సమయానికి వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?