త్వరలో బీజేపీలో చేరే ఛాన్స్
Nagar Kurnool | బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. తన పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని బాలరాజు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. అలాగే, తన మిషన్ మాత్రం కొనసాగుతుందని, చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. గువ్వల బలరాజు (Guvvala Balaraju ) తన రాజీనామా వెనుక ఎటువంటి నిందలు లేవని, కేవలం గౌరవం, కృతజ్ఞతతోనే పార్టీకి వీడ్కోలు చెబుతున్నానని స్పష్టం చేశారు. ‘ఇది బాధతో కూడిన రాజీనామా – కానీ పార్టీ పట్ల నా గౌరవం మారద అని తన తుది వాక్యంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 9న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.