పురుగుల అన్నంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీష్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘పురుగుల అన్నం’ పెట్టిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వాగ్దానాలను హరీష్‌రావు గుర్తు చేస్తూ నిలదీశారు.
సమీక్షలు ఏమయ్యాయి?
“ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తాను” అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? గత 23 నెలలుగా మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు? “విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతాను” అని మీరు చేసిన బెదిరింపులు ఏమైపోయాయి? కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని మీరు జైలుకు పంపారు? ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదని, ఆచరణకు దిక్కులేదని హరీష్‌రావు విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు “మాకొద్దు పురుగుల అన్నం” అంటూ రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో స్కాంలే.. స్కీంలు లేవు!
రాష్ట్ర పాలనపై హరీష్‌రావు తీవ్ర ధ్వజమెత్తారు. “చిల్లర మాటలు, చీప్ పాలిటిక్స్ తప్ప మీరు చేసింది ఏమీ లేదు” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు. “స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు. అందిన కాడికి దండుకునే ప్లాన్లు, వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు… ఇదే కదా గత 23 నెలలుగా నువ్వు చేస్తున్నది రేవంత్ రెడ్డి?” బడి పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రి @revanth_anumula ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టు
ముఖ్యమంత్రి గారు.. ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తానన్న మీ మాటలేమయ్యాయి?
విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే… pic.twitter.com/zlquYJfwcc— Harish Rao Thanneeru (@BRSHarish) November 28, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







