Heavy Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్, కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఆంధప్రదేశ్ లోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








