Heavy Rains | రాష్ట్రంలో ఈనెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయని. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది. ఇక సోమవారం వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిశాయి.
27న ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఈనెల 27న ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక బుధవారం మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హెచ్చరిస్తూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.
Heavy Rains : ఈనెల 29న వర్షాలు..
ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గురువారం అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్‌ని జారీ చేసింది ఐఎండీ. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిలాల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.