Home Ministry Mock drill Update | ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతామని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్‌పై దౌత్య పరమైన యుద్ధం ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మరోవైపు యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వెనువెంటనే సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home Ministry ) అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈనెల 7న బుధవారం మాక్ డ్రిల్ (Mock drill ) నిర్వహించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగినపుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలి. పౌరులు భద్రతా చర్యలు ఎలా పాటించాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది.
పాకిస్తాన్(Pakistan)తో తీవ్ర ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్న తరుణంలో తాజాగా కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకవేళ వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఈ నెల 7వ తేదీన సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్స్ (Civil defense Mock drill) నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యార్ధులకు ఈ విషయంలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. దేశ సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే దీనిపై అప్రమత్తం చేశారు. సరిహద్దులోని విద్యార్ధులకు ఇప్పటికే పూర్తిగా అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రువుల దృష్టి మరల్చడంపై అవగాహన కల్పిస్తారు. 1971 యుద్దం తరువాత దేశంలో తొలిసారి ఈ స్థాయిలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు.
Mock drill : మ్యాక్ డ్రిల్ లో ఏం చేస్తారు.
- Home Ministry Mock drill : ముందుగా, వైమానిక దాడి హెచ్చరిక సైరన్ మోగిస్తారు. దీని అర్థం దాడి గురించి హెచ్చరిక జారీ చేస్తారు.
- పౌరులు, విద్యార్థులకు ప్రజల రక్షణ గురించి శిక్షణ ఇస్తారు. దాడి జరిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇస్తారు.
- క్రాష్ బ్లాక్ అవుట్ చర్యలు తీసుకుంటారు. దీని అర్థం దాడి సమయంలో, లైట్లు ఆపివేస్తారు. అంటే క్రాష్ బ్లాక్ అవుట్ చేయడానికి ఏర్పాట్లు చేయబడతాయి.
- ముఖ్యమైన ఇన్‌స్టాలేషన్‌లను త్వరగా భద్రపరుచుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. శత్రువుల నుండి రక్షించడానికి ముఖ్యమైన ప్రదేశాలను, వస్తువులను వీలైనంత త్వరగా ఎలా దాచాలో మీకు వివరిస్తారు.
- వేగంగా తరలించే ప్రణాళిక గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. తరలింపు ప్రణాళిక అంటే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లే విధానాలను తెలుపుతారు. అంటే యుద్ధం జరిగితే సామాన్య ప్రజలను సురక్షిత ప్రదేశాలకు ఎలా తీసుకెళ్లాలో సన్నాహాలు చేసే పద్ధతులను వివరిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.