Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మైనారిటీ గురుకుల పాఠశాలలో
మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి మరియు నిలోఫర్ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన: ఘటన గురించి తెలిసిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్ద, ఆసుపత్రుల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రానాయక్ తండా పాఠశాలలో
మాదాపూర్ పరిధిలోని చంద్రానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో కలుషితమైన పాయసం తినడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 44 మంది విద్యార్థులు స్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు 38 మందిని అంబులెన్స్ ద్వారా కొండాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని నానక్‌రాంగూడలోని రెయిన్‌బో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఆగ్రహం
చంద్రానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల ఘటనలో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ, ఉపాధ్యాయులు తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా విషయం తెలిసిందని వాపోయారు. కనీసం తమ పిల్లలకు ప్రమాదం జరిగిందన్న విషయం చెప్పకపోవడంపై ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







