హైదరాబాద్ (Hyderabad) జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఈ రోజు ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. రత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి (Real estate businessman)ని గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. బైక్‌పై ఉన్నఅతడిపై తొలుత కాల్పులు జరిపి, ఆపై కత్తులతో దాడి చేసి హత్య (murder) చేశారని తెలుస్తోంది.
ఆర్థిక వైరం ప్రధాన కారణమా?
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. హత్యకు దుండగులు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని, ఇతర ఆధారాలను సేకరించారు. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజ్‌ను కూడా సేకరించారు. ఆస్తుల వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో చోటుచేసుకున్న విభేదాలే (financial issue) ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే దుండగులు రత్నంను నడిరోడ్డుపై మర్డర్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రత్నంతో గొడవలు ఉన్న వ్యక్తులే నేరుగా హత్య చేశారా? లేదా సుపారీ గ్యాంగ్ ద్వారా చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
ప్రత్యేక బృందం ద్వారా విచారణ
ఇది సాధారణ హత్య కాదని, ఏదో లక్ష్యంతో చేసిన దాడి అని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రత్నం (Ratnam)తో వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న వ్యక్తులను విచారిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల వివాదాలు వంటి అంశాలను లోతుగా ఈ బృందం పరిశీలిస్తోందని సమాచారం. దాడి జరిగిన ప్రాంతం చుట్టూ ఉన్నవారి నుంచి కూడా పోలీసులు (police) వివరాలు సేకరిస్తున్నారు. ఎవరికైనా సంఘటన సమయంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించారా? ప్రాంతంలో ఎలాంటి గొడవల శబ్దాలు వినిపించాయా? వంటి ప్రశ్నలతో స్థానికులను విచారిస్తున్నారు. దుండగులు ఏ మార్గం మీదుగా వచ్చారు? హత్య తర్వాత ఏ దిశలో పారిపోయారు? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీప ప్రాంతాలన్నీ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు పోలీసులకు దొరికినట్టు తెలిసింది. విచారణ ఆరంభ దశలో ఉండటంతో పోలీసులు ఇంకా పూర్తివివరాలు వెల్లడించలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







