IB Vacancy 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau Recruitment -IB)లో కొత్తగా భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) విభాగంలో మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Central Government Recruitment) ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబరు 14 వరకు స్వీకరించనున్నారు.
అర్హతలు, వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 -25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు (Age Relaxation) వర్తిస్తుంది.
IB Vacancy 2025: ఎంపిక ప్రక్రియ
IB మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాల్లో ఎంపిక పలు దశల్లో నిర్వహించబడనుందని అధికారులు వెల్లడించారు.
-ముందుగా టైర్ 1 రాతపరీక్ష
- తరువాత టైర్ 2 రాతపరీక్ష
-అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్
-చివరిగా మెడికల్ పరీక్ష
ఈ నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి మాత్రమే నియామకం లభిస్తుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
వివరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.inను సందర్శించాలని IB సూచించింది. దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా విధానం, సిలబస్, ఇతర సూచనలన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
వేతనం (Pay Scale)
MTS పోస్టుల వేతనం పే లెవల్ – 1 ( రూ.18,000 – రూ.56,900) ఉండొచ్చు.
అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
ఉద్యోగార్థులకు మంచి అవకాశం
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా ప్రారంభ అర్హతగా 10వ తరగతి (10th Pass Jobs) సరిపోవడం, వయోపరిమితి సడలింపులు ఉండడం ఉద్యోగార్థులకు అనుకూలంగా మారాయి.







