Sarkar Live

iBomma : క‌రేబియ‌న్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్‌పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌

పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్టు iBomma గురించి తెల‌య‌ని సినీ ప్రేమికులు ఉండ‌రు. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ iBomma వెబ్‌సైట్ అక్రమంగా అప్‌లోడ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమకు సంబంధించిన

iBomma

పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్టు

iBomma గురించి తెల‌య‌ని సినీ ప్రేమికులు ఉండ‌రు. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ iBomma వెబ్‌సైట్ అక్రమంగా అప్‌లోడ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమకు సంబంధించిన సంఘాలు అనేక‌మార్లు ఫిర్యాదులు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయినా దీని నిర్వాహకులెవ‌రు.. ఎక్కడ ఉంటారు? అనేది తెలియ‌రాలేదు. చివ‌ర‌కు తెలంగాణ పోలీసులు దీని iBomma ఆట‌కట్టించారు. ఈ వెబ్‌సైట్ నిర్వాహుడిని క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు.

iBomma నిర్వాహుడు (iBomma administrator) ఇమ్మ‌డి ర‌వి (Imaddi Ravi)గా గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అత‌డిని సీసీఎస్ (Hyderabad CCS police) పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. చాలా కాలంగా కరీబియన్ దీవుల్లో నివసిస్తున్న ర‌వి అక్కడ నుంచే ఈ ఆపరేషన్‌ను న‌డిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

iBomma ఎలా పనిచేసేది?

సినిమా విడుదలైన రోజు లేదా కొన్ని గంటలకే దాని పిరేటెడ్ కాపీ iBommaలో కనిపించేది. థియేటర్లలో చూపించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీస్తే, అందులో ఆదాయం రావాల్సిన ముఖ్యమైన రోజుల్లోనే పైరసీ కాపీ బయటకు వెళ్లేది. దీంతో నిర్మాత‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయేవారు. ఈ నేప‌థ్యంలో పలుమార్లు నిర్మాతలు, నిర్మాణ సంస్థల నిర్వాహ‌కులు పోలీసులకు కంప్లైంట్‌లు ఇచ్చారు. ప్రత్యేకంగా తెలుగులో విడుదలయ్యే సినిమాలపై ఈ వెబ్‌సైట్ భారీ ప్రభావం చూపుతోందని ఆరోపణలు వచ్చాయి.

iBomma వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్‌గా ఉండేది. మంచి ప్రింట్‌లో సినిమా కనిపించేది. ప్రజలు కూడా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకునేలా లింకులు ఉండేవి. అందుకే ఒక సమయంలో ఈ వెబ్‌సైట్‌కు చాలా పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ట్రాఫిక్ వచ్చేది. ఇదే రీతిలో దీనిద్వారా భారీ స్థాయిలో ప్రకటనల రూపంలో ఆదాయం కూడా రాబడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్రాన్స్ నుంచి అరెస్టుకు దారి

రవి గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్‌లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేసి, భారత్‌కు తిరిగి వచ్చే సమయాన్ని గుర్తించారు. నిన్న అతడు హైదరాబాద్‌కి రాగానే, కూకట్‌పల్లిలో ఉన్నప్పుడు సీసీఎస్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రవి కారీబియన్ (Caribbean islands) దేశాల్లో ఉన్నప్పుడు చాలా భద్రతగా, తన అసలు వివరాలు బయట పడకుండా ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించేవాడని విచారణలో తెలుస్తోంది. పలు సర్వర్లు విదేశాల్లో ఉంచడం, VPN‌లను ఉపయోగించడం, ట్రాఫిక్ డైవర్షన్ పద్ధతులు వంటివి ఉపయోగించి ఈ వెబ్‌సైట్‌ను ట్రేస్ చేయడం కష్టతరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

రవి అకౌంట్లలో రూ.3 కోట్లు ఫ్రీజ్

దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు రవి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. iBomma ద్వారా వచ్చిన ఆదాయంలో భాగంగా, రవి వ్యక్తిగత అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్లు వరకు పోలీసులు గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆస్తుల వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

సినీ పరిశ్రమకు నష్టం ఎంత?

పైరసీ (Movie piracy) అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద సమస్య. ఒక సినిమా విడుదలైన మొదటి వారం అత్యంత కీలకం. అదే సమయంలో సినిమా పైరసీ వెబ్‌సైట్లలోకి వెళ్లిపోతే, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రత్యేకంగా చిన్న బడ్జెట్ సినిమాలు, కొత్త హీరోలు తీసిన సినిమాలు చాలా పెద్ద నష్టాన్ని చవిచూస్తాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రతి ఏటా తమిళం, తెలుగు, హిందీ భాషలతో కలిపి వేల కోట్ల రూపాయల నష్టం పైరసీ వల్లనే జరుగుతోంది.

తెలుగు నిర్మాతలు ఎన్నోసార్లు iBommaపై తీవ్రంగా మండిపడ్డారు. “సినిమా తీసే మా కష్టాన్ని ఒక క్లిక్‌తో కొట్టేయకండి.” అని ప్రేక్ష‌కుల‌ను వేడుకొనేవారు. పైరసీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేసినా, కేసులు పెట్టినా, సరైన నిర్వాహకుడు పట్టుబడకపోవడంతో అధికారులు తమకు ఏం చేయలేమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ అరెస్టుతో పరిశ్రమలో కొంత ఊరట కలిగింది.


1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?