IBS admissions : ఐసీఎఫ్ఏఐ (ICFAI) యూనివర్సిటీ ఆధ్వర్యంలోని బిజినెస్ స్కూల్ (IBS)లో అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభమైంది. ఎంబీఏ /పీజీపీఎం (MBA/PGPM) ప్రోగ్రామ్స్‌లో 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల (IBS admissions ) కోసం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో ఇది కొనసాగనుంది.
ఎంపిక విధానంలో మార్పులు ఏమింటే…
దేశంలోని ఐదు ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో IBS ఒకటి. ఇది వృత్తిపర, పరిశోధన ఆధారిత బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందించడంలో పేరు గాంచింది. ఈ సంవత్సరం IBS తమ ఎంపిక విధానంలో ఒక కీలక మార్పు చేసింది. సాధారణంగా గ్రూప్ డిస్కషన్ (GD) నిర్వహించే ఈ విద్యాసంస్థ కొత్తగా మైక్రో ప్రజెంటేషన్ అనే ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల ప్రతి విద్యార్ఙికీ వ్యక్తగతంగా తమ ఆలోచనలను చక్కగా వ్యక్తీకరించే మంచి అవకాశం లభిస్తుంది. అభ్యర్థుల విమర్శనాత్మక ఆలోచన, కమ్యూకేషన్ స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి ఈ విధానాన్ని రూపొందించారు.
IBS admissions : అర్హులు ఎవరు?
IBS ప్రవేశాల కోసం IBSAT 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు లేదా CAT (Common Admission Test), GMAT (Graduate Management Admission Test), XAT (Xavier Aptitude Test), NMAT by GMAC పరీక్షల ద్వారా అర్హత పొందినవారు తమ ఎంపిక ప్రక్రియ కోసం హాజరుకావాలి. ఈ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులు IBS ఎంపిక ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి
IBS admissions ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే..
- బ్రీఫింగ్ సెషన్ (Briefing Session): ఈ దశ IBS గురించి అభ్యర్థులకు పూర్తి అవగాహన కలిగించే విధంగా ఉంటుంది. అభ్యర్థులు, తమ తల్లిదండ్రులు లేదా గార్డియన్లతో కలిసి IBS సీనియర్ డైరెక్టర్లు, రిక్రూటర్లు, IBS అలుమ్నీలతో జరిగే ప్రత్యేక సమావేశంలో పాల్గొనాలి. ఐబీఎస్ విద్యా విధానం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు గురించి వివరిస్తారు. అలుమ్నీలు తమ అనుభవాలు వ్యక్తపరుస్తారు. గ్రాడ్యుయేట్లకు ఉన్న అవకాశాలు తదితర అంశాలను చర్చిస్తారు. ఈ సెషన్‌లో పాల్గొనడం ద్వారా IBSలో చదవడానికి ఉండే ప్రయోజనాలు, కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యత గురించి క్లారిటీ లభిస్తుంది.
- మైక్రో ప్రెజెంటేషన్ (Micro Presentation): సంప్రదాయ గ్రూప్ డిస్కషన్‌కు బదులుగా IBS ఈసారి మైక్రో ప్రెజెంటేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. అభ్యర్థి 1 నుంచి 100 మధ్య ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఆ సంఖ్యకు అనుగుణంగా ఒక అంశాన్ని IBS కమిటీ నుంచి పొందుతారు. అభ్యర్థి ఆ అంశంపై సిద్ధం కావడానికి ఒక నిమిషం, తన ఆలోచనలను వ్యక్తపర్చేందుకు మూడు నిమిషాల సమయం ఇస్తారు.
అభ్యర్థి తనకు కేటాయించిన అంశం కష్టంగా అనిపిస్తే ఒక్కసారి మాత్రమే టాపిక్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రెజెంటేషన్ సమయంలో తన ఆలోచనలను ఎలా వ్యక్తపరిచారు.. అవి ఎంత బలమైనవి, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఉందా? అనే విషయాలను పరీక్షిస్తారు.
ఈ దశలో ఫాలో అప్ ప్రశ్నలు ఉండవు. అంటే.. అభ్యర్థికి ఆత్మవిశ్వాసంతో సుస్పష్టంగా తన ప్రెజెంటేషన్‌ను ముగించే అవకాశం ఉంటుంది. - వ్యక్తిగత ఇంటర్వ్యూ (Personal Interview – PI): ఇంటర్వ్యూలో IBS ప్యానెల్ అభ్యర్థి కెరీర్ లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వృత్తిపరమైన స్పష్టత వంటి అంశాలను అంచనా వేస్తుంది. అభ్యర్థి గత విద్యా జీవితాన్ని, ప్రస్తుత ఆసక్తులను, భవిష్యత్ ప్రణాళికలను గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా స్పష్టత (clarity), ఆత్మవిశ్వాసం (confidence), కమ్యూనికేషన్ స్కిల్స్ (articulation) ప్యానెల్ సభ్యులు పరిశీలిస్తారు. అభ్యర్థికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? బిజినెస్ లీడర్‌గా ఎదిగే సామర్థ్యం ఉందా? అనే అంశాలను నిశితంగా పరీక్షిస్తారు.
- విద్యా ప్రతిభ (Academic Performance): అభ్యర్థి గత విద్యా రికార్డుల ఆధారంగా ఎంపిక ప్రక్రియలో 50% వెయిటేజ్ ఉంటుంది. 10వ తరగతి (Class X), 12వ తరగతి (Class XII), గ్రాడ్యుయేషన్ మార్కులను పరిశీలిస్తారు. విద్యార్థి గత విద్యా జీవితంలో సాధించిన ప్రతిభ IBS MBA/PGPM లో ప్రవేశం పొందేందుకు ముఖ్యమైన క్రైటీరియా అవుతుంది. గత విద్యా ఫలితాలు విద్యార్థి కష్టపడి నేర్చుకునే గుణాన్ని, ప్రణాళికాబద్ధతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంటర్వ్యూలు ఎలా బుక్ చేసుకోవాలి?
ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు బుక్ చేసుకోవడానికి:
- IBS అధికారిక వెబ్‌సైట్ https://www.ibsindia.org సందర్శించాలి.
- ఇంటర్వ్యూ స్లాట్‌ను బుక్ చేసుకోవాలి.
- ఎంపిక ప్రక్రియ తేదీలకు హాజరయ్యే విధంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి.
IBS MBA/PGPM కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులకు IBS ఎంపిక ప్రక్రియలో పాల్గొనడం తప్పనిసరి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..