- అంజద్ ను ఓ ‘సూర్యుడి” వలే రక్షిస్తున్న సీనియర్ “డీఆర్ “?
- క్రమశిక్షణా చర్యల పేరుతో హుజూర్ నగర్ కు బదిలీ చేసినట్లు తెలిపిన డిఐజీ..
- సస్పెండ్ చేయాల్సిన సబ్ రిజిస్ట్రార్ ను హుజూర్ నగర్ కు బదిలీ చేయడం వెనుక “హరికోట్ల” వ్యూహం..?
- ఇప్పటికే అంజద్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్ నెంబర్లు బహిర్గతం చేసిన “సర్కార్ లైవ్”
Illegal registrations in Warangal : అంజద్ అలీ… అక్రమ రిజిస్ట్రేషన్ లకు పెట్టింది పేరు,అక్రమాలను సైతం ఈజీగా తన రిజిస్ట్రేషన్ లతో సక్రమం చేయొచ్చనే ఉద్దేశ్యంతో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ లు చేసి అడ్డంగా దొరికిపోయాడు. కాసుల కోసం కక్కుర్తి పడ్డ సదరు సబ్ రిజిస్ట్రార్ అనేక అక్రమ రిజిస్ట్రేషన్ (illegal registrations)లకు పాల్పడినట్లు “సర్కార్ వెబ్ సైట్ “డాక్యుమెంట్ నెంబర్ లతో సహా సంచలన కథనాలను ప్రచురించింది. మరికొద్ది నెలల్లోనే సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ(Amjad Ali)కి పదవీ విరమణ ఉండడంతో కాపాడేందుకు “సూర్యుడి” లాంటి ఓ”డీఆర్” రంగంలోకి దిగి సస్పెండ్ కాకుండా కాపాడినట్లు విశ్వసనీయ సమాచారం. వరంగల్ ఆర్వో కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ (Sub Joint Registrar) గా విదులు నిర్వహించిన కాలంలో అంజద్ అలీ అనేక అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి కోట్లు కొల్లగొట్టాడాని స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో ప్రచారం జోరుగా సాగుతోంది.హరికోట్ల వ్యూహంతో రెచ్చిపోయిన ఆ సబ్ రిజిస్ట్రార్ విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ లు చేసినట్లు తెలిసింది.
హుజూర్ నగర్ కు బదిలీ…?
వరంగల్ ఆర్వో కార్యాలయం (Warangal Registration Office) లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన అంజద్ అలీ వందల కొద్దీ అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసినట్లు ఆధారాలతో సహా( డాక్యుమెంట్ నెంబర్లు) ” సర్కార్ వెబ్ సైట్” బయట పెట్టగా స్పందించిన ఉన్నతాధికారులు అంజద్ అలీని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ కు బదిలీ చేసినట్లు వరంగల్ “డి ఐ జి “సుభాషిణి సర్కార్ వెబ్ సైట్ ప్రతినిధితో అన్నారు.సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ విధుల్లో చేరినప్పటి నుండి ఇప్పటివరకు చేసిన అన్ని డాక్యుమెంట్ లపై ఆడిట్ చేస్తున్నామని త్వరలోనే చర్యలు తీసుకుంటామని డి ఐ జి స్పష్టం చేశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆధారాలు (డాక్యుమెంట్ నెంబర్లు) బహిర్గతం చేసినప్పటికీ విచారణ పేరుతో జాప్యం చేయటం అంటే పరోక్షంగా అక్రమాల సబ్ రిజిస్ట్రార్ ను కాపాడే ప్రయత్నం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Illegal registrations : రక్షణ కవచంలా ఓ రిజిస్ట్రార్..?
సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ వెనుక ఓ అదృశ్య శక్తి ఉందని, ఆ శక్తి నిత్యం ఆ అక్రమ సబ్ రిజిస్ట్రార్ ను కాపాడుతూనే ఉంటుందని విశ్వసనీయ సమాచారం.అక్రమాలకు మారుపేరుగా మారిన అంజద్ వరంగల్ ఆర్వో కార్యాలయంలో జాయిట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు రిజిస్ట్రార్ కు తెలియకుండా ఏ పని చేసేవాడు కాదని విశ్వసనీయ సమాచారం.సబ్ రిజిస్ట్రార్ అంజద్ చేసిన 29 అక్రమ రిజిస్ట్రేషన్ లు సదరు “డీఆర్” వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడే చేయడం గమనార్హం.
ఆ ప్రచారం నిజమేనా…?
సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ విధులు నిర్వహించిన ప్రతిచోట అనేక అక్రమ రిజిస్ట్రేషన్ (Illegal registrations )లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వరంగల్ ఆర్వో కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వందల కొద్దీ అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి కోట్లకొద్ది డబ్బు కూడబెట్టినట్లు వరంగల్ ఆర్వో కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ లు కోడై కూస్తున్నారు.ఐటీ అధికారులతోపాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు సదరు సబ్ రిజిస్ట్రార్ పై నిఘా పెడితే బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని వరంగల్ ఆర్వో కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Illegal registrations | “అంజద్” అక్రమ రిజిస్ట్రేషన్ ల చిట్టా..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..