- అక్రమంగా అనేక రిజిస్ట్రేషన్లకు పాల్పడిన చేసిన సబ్ రిజిస్ట్రార్
- హన్మకొండ జిల్లాలో అక్రమ వెంచర్లలోని వందల కొద్దీ ప్లాట్లు రిజిస్ట్రేషన్
- ఒక్కో ప్లాటుకు 30 నుంచి 50 వేలు ?
- వివాదంలో ఉన్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా రిజిస్ట్రేషన్ చేసినందుకు 10 లకారాల పైనే తీసుకున్నట్లు ఆరోపణలు..?
- సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా రిజిస్ట్రార్ ను ఆదేశించిన ఉన్నతాధికారులు
- ఆ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లను జిల్లా రిజిస్ట్రార్ సైతం”మాములు”గా తీసుకున్నట్లు ప్రచారం..
Illegal Registrations | ఆ అధికారి తీరే వేరు, అక్రమార్కులకు కొమ్ముకాయడం, రియల్టర్ లతో అంటకాగడం , అక్రమాలను సక్రమంగా చేయడంలో ఈ సబ్ రిజిస్ట్రార్ “పీ హెచ్ డీ” చేసినట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు కోడైకూస్తున్నారు. పత్రాలు లేని భూమిని రిజిస్ట్రేషన్ చేయడం,అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ లు చేసి రియల్టర్ లతో నజరానాలు పొందడం లో సబ్ రిజిస్ట్రార్ ది అందెవేసిన చెయ్యి అని తెలిసింది. గత 10 సంవత్సరాలు గా ఉమ్మడి వరంగల్ జిల్లా ను వదలని సదరు సబ్ రిజిస్ట్రార్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సారు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్(Illegal Registrations )లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా “సూర్యుడు” లాంటి ఆ అధికారి కాపాడేవాడని సమాచారం.వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన సదరు సబ్ రిజిస్ట్రార్ అనేక అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకొని ఇటీవలే జనగామ జిల్లాకు బదిలీ పై వెళ్లినట్లు తెలుస్తోంది. సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ను తెలంగాణ స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్/ ఇన్స్పెక్టర్ జనరల్ మూడునెలల క్రితం అంటే సెప్టెంబర్ 12 వ తేదీన ఆదేశించినట్లు సమాచారం. అయితే సదరు జిల్లా రిజిస్ట్రార్ కూడా మరో చోటుకి బదిలీ అయ్యారు
ఒక్కో ప్లాటుకు 30 నుండి 50 వేలు…
వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ పై జనగామ జిల్లాకు వెళ్లిన సదరు అధికారి అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను ప్రభుత్వ నిబంధనలకు రిజిస్ట్రేషన్ లు చేసినట్లు తెలిసింది.అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసినప్పటికీ అనేక ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి అందినకాడికి దండుకున్నట్లు సమాచారం. కొంతమంది రియల్టర్ లు చేసిన అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకుగాను ఒక్కో ప్లాటుకు ఏరియాను బట్టి 30 నుండి 50 వేల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ లపై(డాక్యుమెంట్లు) విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే అధికారి అక్రమాలు బయటపడుతాయని సమాచారం
అక్రమ రిజిస్ట్రేషన్ (Illegal Registrations ) … భారీ నజరానా..?
జనగామ జిల్లాకు బదిలీ పై వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించినప్పుడు అనేక అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రిజిస్ట్రేషన్ ల యందు ఈ రిజిస్ట్రేషనే వేరయా …అనే రీతిలో అనే స్థాయిలో ఓ 17 గుంటల వ్యవసాయ భూమిని అందులోనూ వివాదంలో ఉన్న భూమిని ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండా వ్యవసాయేతర భూమిగా చూపిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. సదరు భూమిని రిజిస్ట్రేషన్ చేసినందుకు సారుకు భారీ మొత్తంలో అంటే 10 లకారాల పైనే ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్టాంప్స్&రిజిస్ట్రేషన్ కమిషనర్/ఇన్స్పెక్టర్ జనరల్ అప్పటి జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవికి ఆదేశాలు సైతం జారీచేశారు. మరి సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ల పై “డి ఆర్ “విచారణ చేశారా?చేస్తే విచారణలో ఏంతేలింది? అనేది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కే తెలియాలి.అనేక అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన సబ్ రిజిస్ట్రార్ బదిలీ పై వెళ్లి చర్యల నుండి తప్పించుకున్నట్లు సన్నిహితుల వద్ద గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..