- సబ్ రిజిస్ట్రార్ అంజద్ ఆలీ అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేస్తున్న డిఐజి
- డిఐజి మేడం చూడండి “అంజద్ ” చేసిన మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్ల భాగోతం
- అక్రమాలు కళ్ళకు కనపడుతున్నా విచారణ పేరుతో జాప్యమెందుకు మేడం..?
- మేడంజీ విచారణ పూర్తయ్యేదెన్నడు..?చర్యలు తీసుకునేదెప్పుడంటూ జోరుగా విమర్శలు..
Illegal registrations in Warangal సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ అక్రమాలకు అంతే లేదని, సదరు అధికారి అక్రమాలు అన్నీ ఇన్నీ కావని తెలుస్తోంది. తవ్వుతున్నా కొద్దీ అక్రమాలు బయటపడటంచూస్తుంటే ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar ) ఏ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసాడో అర్ధంచేసుకోవచ్చు. బహుశా స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ (stamps and registration) లో ఈ స్థాయి అక్రమ రిజిస్ట్రేషన్ లు ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా చేసిన దాఖలాలు కూడా లేకపోవచ్చు.ప్రభుత్వ నిబంధనలను భేఖాతారు చేస్తూ వందల కొద్దీ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు తెలుస్తోంది. సెలవు పెడితే చర్యల నుండి తప్పించుకోవచ్చనే ఆలోచనతోనే సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ లీవ్ పెట్టినట్లు తెలుస్తోంది. సెలవులో ఉన్నాకూడా చర్యలు తీసుకోవచ్చని సస్పెండ్ చేయడానికి, లీవ్ పెట్టడానికి సంబంధం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంజద్ అలీ అక్రమ రిజిస్ట్రేషన్ ల చిట్టా (Illegal registrations List) .. మచ్చుకు కొన్ని
15-04-2024 రోజున..
8098/2024,8099/2024 (2)రిజిస్ట్రేషన్లు
01-06-2024 రోజున..
11873/2024,11872/2024,11866/2024 (3) రిజిస్ట్రేషన్ లు
17-05-2024 రోజున … 10452/2025,10453/2024,10454/2024,10455/2024,10456/2024,10457/2024 (6)రిజిస్ట్రేషన్ లు
12-01-2024 రోజున..
1057/2024,1056/2024 (2) రిజిస్ట్రేషన్ లు
29-12-2023 రోజున..
28484/2024 తోపాటు28-08-2023 రోజున..19078/2024 (2)రిజిస్ట్రేషన్ లు
26-06-2024 రోజున..
13910/2024,13911/2024,13912/2024 (3)రిజిస్ట్రేషన్ లు
28-10-2023 రోజున..
.23978/2023,23979/2023,23980/2023 (3) రిజిస్ట్రేషన్ లు
23-05-2024 రోజున..
11125/2024,11126/2024,11127/2024 (3) రిజిస్ట్రేషన్ లతోపాటు10-06-2024 రోజున.. 12568/2024 (1) రిజిస్ట్రేషన్
04-07-2024 రోజున..
14816/2024,14776/2024 (2) రిజిస్ట్రేషన్ లు
04-10-2023 రోజున.. 22026/2023 (1)తోపాటు 12-10-2023 రోజున 22825/2023(1),
అలాగే 31-01-2024 రోజున 2292/2024(1)
పైన పేర్కొన్న డాక్యుమెంట్లే కాకుండా సదరు సబ్ రిజిస్ట్రార్ అంజద్ చేసిన అనేక అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసినట్లు సమాచారం.
డిఐజి మేడం విచారణ పూర్తయ్యేదెన్నడు? చర్యలు తీసుకునేదెప్పుడు..?
సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ (Illegal registrations) లపై స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ వరంగల్ డిఐజీ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణ కొనసాగుతున్న తీరుపై సొంత శాఖలోనే విమర్శలు వస్తున్నాయి. మిగితా వారిపై విచారణ జరిగినట్లు అంజద్ ఆలీపై విచారణ జరగట్లేదని ఇంతకుముందు సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ లు ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా విచారణ కేవలం కొన్ని ఫిర్యాదులపైనే జరుగుతుండగా “సర్కార్ వెబ్ సైట్” మరికొన్ని అక్రమ రిజిస్ట్రేషన్ లను ఈ కథనం ద్వారా బహిర్గతం చేస్తుంది. పైన పేర్కొన్న రిజిస్ట్రేషన్ లపై కూడా డి ఐ జి మేడం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చూద్దాం విచారణ ఎన్ని రోజులు చేస్తారో? అసలు చర్యలు తీసుకుంటారో లేదో..చూడాలి మరి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Illegal registrations | “అంజద్” అక్రమ రిజిస్ట్రేషన్ ల చిట్టా..”
అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి రిజిస్ట్రార్ను కఠినంగా శిక్షించాలి – అక్రమంగా సంపాదించిన సొమ్ము రికవరీ చేయాలి మరియు రిమోల్ ఫ్రొమ్ సర్వీస్ చేయాలి – వీరు చేసే అక్రమ రిజిస్ట్రేషన్ ల వలన ఎన్నో కుటుంబాలు నాశనం ఆగుచున్నవి మరియు అమాయకులు హత్యలకు గురిగుచున్నారు..,.. మహేంద్ర వసంత విహారు KUDA లేఔట్ DP No. 35/1992 లొ ప్లాట్ No. 62 &63 ప్లాట్స్ మధ్య గల రోడ్ రిజిస్ట్రేషన్ చేసినారు ఎలాంటి లింక్ డాకుమెంట్స్ లేకుండా తండ్రి కొడుక్కి గిఫ్ట్ డీడ్
చేసినాడు DOC. No.28973/2019 ఎవరికీ కంప్లైంట్ చేసిన యాక్షన్ లేదు.