- 22 నుంచి 25 వరకు కురిసే అవకాశం
- హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
TG Weather Report : వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే సూర్య ప్రతాపానికి ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ మండుటెండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా, బుధవారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లా 41.3, నిజామాబాద్ 41.2, కొమురంభీం ఆసిఫాబాద్ 41.1, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్ 41, జగిత్యాల జిల్లాల్లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలిపింది.
TG Weather Report Today : నేటి (గురువారం మార్చి 20) వాతావరణాన్ని గమనిస్తే.. ఉదయం నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది. కానీ సాయంత్రం తర్వాత రాయలసీమలోకి మేఘాలు ప్రవేశిస్తాయి. క్రమంగా అవి దక్షిణ తెలంగాణ, కోస్తాకు కూడా విస్తరిస్తాయి. ఈ క్రమంలో 21 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతుంది. ఇక గాలి వేగం గమనిస్తే.. సముద్రాల్లో గాలి వేగం గంటకు 20 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అయితే . నేటి రాత్రి అయ్యే కొద్దీ గాలి వేగం రెండు రాష్ట్రాల్లోనూ పెరుగుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







