Indhiramma Houses : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వేగంగా ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్పికలకు ముందే లబ్ధిరాలకు పంపిణీ అందజేయాలని భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం (Telangana Government) కసరత్తు పూర్తి చేసింది.
హామీలు నెరర్చే దిశగా..
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం (Revanth Reddy Government) చేయూతనిస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో 71,482 మందికి ఇళ్లు అందజేయనున్నారు.
మూడు దశల్లో Indhiramma Houses
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు విభాగాలుగా విభజించారు:
- ఎల్-1 జాబితా: సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు.
- ఎల్-2 జాబితా: సొంత స్థలం ఉండి గుడిసెలు, పూరిపాకలు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారు.
- ఎల్-3 జాబితా: సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నవారు.
మొదటగా ఎల్-1 జాబితాలోని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. స్థలం ఇప్పటికే ఉండటం వల్ల ఇక్కడ నిర్మాణ పనులు త్వరగా చేపట్టవచ్చు.
పకడ్బందీగా సర్వే
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారులను మూడు విభాగాలుగా విభజించారు. ఈ సర్వే ప్రకారం:
- ఎల్-1లో 21.93 లక్షల దరఖాస్తులు
- ఎల్-2లో 19.96 లక్షల దరఖాస్తులు
- ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులు ఉన్నాయి.
హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరిలో ఎల్-1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మంది ఉన్నారు. కొత్త దరఖాస్తుల నుంచి మరో 3,998 మందికి అవకాశం కల్పించారు.
సొంత స్థలం ఉన్నవారికే తొలి అవకాశం
ప్రభుత్వం ప్రస్తుతానికి భూసేకరణ చేసి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో మొదటి దశలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఎదురుచూస్తున్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అందుకే ఎల్-1 నుంచి అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఎల్-2, ఎల్-3 జాబితాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులకు కూడా 11,675 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు.
దరఖాస్తుదారుల్లో అనర్హులు
మొదటి దశలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత దశలవారీగా ఎల్-1, ఎల్-2లోని మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎల్-3లో వచ్చిన 33.87 లక్షల మంది దరఖాస్తుదారుల్లో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా గుర్తించారు.
ప్రత్యామ్నాయాలు పరిశీలించి.. చివరిగా..
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ సందర్భంగా ప్రభుత్వం చాలా ప్రత్యామ్నాయాలు పరిశీలించింది. గత బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అవి దాదాపు అపార్ట్‌మెంట్ రూపంలో బ్లాకులుగా ఉండటం, వాటిల్లో చాలా చోట్ల అసంపూర్తి నిర్మాణాలు ఉండటంతో కొత్తగా ఇందిరమ్మ ఇళ్లే ఇవ్వాలని నిర్ణయించారు.
సాంతింటి కలను సాకారం చేయాలని..
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకం అమలుతో రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







