India Pakistan Attack Live Updates : ఆపరేషన్ సిందూర్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, ఇప్పుడు తన పరువు కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి జమ్మూ కాశ్మీర్, అమృత్‌సర్, రాజస్థాన్ సరిహద్దు లో పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులను ప్రారంభించింది. గురువారం రాత్రి, పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో జమ్మూ కాశ్మీర్‌తో సహా అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది, దీనిని భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ S-400 భగ్నం చేసింది. దీనికి ఒక రాత్రి ముందు కూడా, పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ దానిని భారత్ శం S-400 వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుని గాల్లోనే పేల్చేసింది.
India Pakistan Attack Live Updates : భారతదేశ పశ్చిమ సరిహద్దులపై పాకిస్తాన్ విఫలమైన దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో బ్లాక్‌అవుట్ నిర్వహించింది. సరిహద్దులో ఉద్రిక్తతల తర్వాత ముందు జాగ్రత్త చర్యగా రాంబన్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని స్థానిక అధికారులు నివేదించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతమంతా నిఘా పెంచగా, నివాసితులు ఇంటి లోపలే ఉండాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత చాలా గంటల తర్వాత బ్లాక్‌అవుట్‌ను ఎత్తివేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.