Jack movie review | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda), ప్రేమ కథలను బాగా తీస్తాడనే పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)కాంబోలో తెరకెక్కిన మూవీ జాక్ (Jack Movie). బీవీఎస్ఎన్ ప్రసాద్(bvsn prasad) నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…..
స్టోరీ ఇదీ …
Jack movie review : దేశంలో టెర్రరిస్టులు ఎటాక్ కి ప్లాన్ చేస్తారు. రా కి ఈ విషయం తెలుస్తుంది.జాక్ అనే వ్యక్తి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్వ్యూ పూర్తయి ఇంకా జాబ్ కన్ఫర్మ్ కాకముందే రా కంటే ముందే ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలనుకుంటాడు. జాక్ రా ఏజెంట్ గా ఎందుకు మారాలనుకునాడు..? టెర్రరిస్టులను పట్టుకున్నాడా..?రా కి ఇది తెలిసి ఏం జరిగింది అనేది మిగతా కథ…
మూవీ ఎలా ఉందంటే (Jack movie review )
టెర్రరిస్టుల ఎటాక్ కి ప్లాన్ చేయడం…రా పట్టుకోవడం అనే జానర్ లో ఇప్పటికీ చాలా మూవీస్ వచ్చాయి. సిద్దు లాంటి హీరోతో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఈ జానర్ అనేది పెద్ద రిస్క్.ఎందుకంటే ప్రేమకథల ను సూపర్ గా తెరకెక్కించే భాస్కర్ వేరే జానర్ లో మూవీస్ ని తీసినప్పుడల్లా దెబ్బతిన్నాడు. జాక్ మూవీ కూడా తనకు ఏ మాత్రం సూట్ కానీ జానర్ లో కి వెళ్ళి మూవీ తీశాడు.మూవీ మొదలైన కొద్దిసేపు బానే ఉందనిపించిన తరవాత పూర్తిగా గాడి తప్పింది.డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో సిద్దు తన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ మూవీ కంటెంట్ వేరు..కానీ ఈ మూవీలో కూడా సిద్దు అదే డైలాగ్ డెలివరీని ప్రజెంట్ చేయడమనేది బిగ్ మిస్టేక్ చేశారనిపించింది. రా ఏజెంట్ అవ్వాలనుకున్న హీరో సిల్లీగా కామెడీ చేయడం,అక్కడక్కడ బూతులు మాట్లాడడం ప్రేక్షకులను మెప్పించదు.టెర్రరిస్ట్ ఎటాక్ అనేది సీరియస్ ఇష్యూ… మూవీని అదే తీరులో నడిపించాల్సిన డైరెక్టర్ తడబడ్డాడు.రా అధికారుల క్యారెక్టర్ ను హుందాతనం తో చూపించాల్సింది పోయి కామెడీ గా చూపించడంతో మూవీని కూడా ఆడియన్స్ కామెడీ గా తీసుకుంటారనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ మూవీ కి బిగ్ మిస్టేక్ అనుకుంటే…ఇలాంటి కథలో ఆడియన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఎక్స్ప్పెక్ట్ చేస్తారు. వాటిపై దృష్టి పెట్టకపోవడం మరో మిస్టేక్ చేశారనిపించింది.మూవీలో ఎమోషన్స్ సరిగా వర్కౌట్ కాకపోవడం మరో మైనస్.ఇలా జాక్ అక్కడక్కడ తప్ప పెద్దగా ఆకట్టుకోలేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
Jack movie review : బేబీ మూవీతో సూపర్ హిట్టు కొట్టి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మూవీ చేయడమనేది వైష్ణవి చైతన్య (Vaishnavi chaithanya)కు పెద్ద ఆపర్చునిటీ. కానీ సిద్ధూ తో కెమిస్ట్రీ బాలేదనిపించింది. సిద్ధూ రా ఏజెంట్లా (Raw Agent) ప్రవర్తించి ఉంటే బాగుండనిపించింది. ఇంకా టిల్లు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదనిపించింది. ఎంతైనా చేసే ప్రకాష్ రాజ్ (Prakash Raj) లాంటి యాక్టర్ ను కొత్త క్యారెక్టర్ లో వాడుకోవాల్సింది. నరేష్, బ్రహ్మాజీ ఎవరి పాత్రల మేరకు వారు నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ తనది కాని జానర్ లో మూవీ తీసి పెద్ద మిస్టేక్ చేశారనిపించింది.సినిమాటోగ్రఫీ విజయ్ చక్రవర్తి (vijay chakravarthy) పనితీరు, నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అచ్చు రాజమణి, సురేష్ బొబ్బిలి, సామ్ సీఎస్ (acchu rahamani, Suresh Bobbili, sam cs) ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ లు పనిచేసినా కూడా వారి మార్క్ అనిపించదు. ఓవరాల్ గా మూవీ బొమ్మరిల్లు భాస్కర్ జాక్ రాక్ అనిపించుకోలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.