Sarkar Live

పీసీసీ చీఫ్ దౌత్యం విఫలం.. రేపు కీలక నిర్ణయం ప్రకటించనున్న సీనియర్ నేత జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy Congress Resignation | కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు విధేయుడిగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి

Jeevan Reddy

Jeevan Reddy Congress Resignation | కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు విధేయుడిగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్, విప్ ఆది శ్రీనివాస్ జరిపిన చర్చలు ఫలించలేదు. పార్టీని వీడొద్దని వారు కోరినప్పటికీ, తన ఆవేదనకు పరిష్కారం లభించలేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.

అధాష్టానాన్ని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి

భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూలబాట కాదని, ముళ్ల బాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి సీఎం అయ్యారు, భట్టి విక్రమార్క సీఎల్పీ నేత కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. నేను మండలిలో పక్ష నేతను కదా? మరి నాకెందుకు అన్యాయం చేశారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ ఫిరాయింపుల బాటలో కాంగ్రెస్ నడవడం ఏంటని, రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్రంలో నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. కె.సి.వేణుగోపాల్ వంటి నేతలు ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు పార్టీలో ఉండటం వల్ల ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు.

జీవన్‌రెడ్డి మాకు తండ్రి లాంటి వారు: మహేష్ గౌడ్

జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఆయనను ఆకాశానికెత్తారు. “జీవన్‌రెడ్డి మాకు తండ్రి లాంటి వారు. ఆయన 43 ఏళ్ల అనుభవం పార్టీకి అవసరం. ఆయన కొన్ని ఇబ్బందులకు గురయ్యారు, కానీ కాంగ్రెస్ ఆయన్ను వదులుకోదు” అని పేర్కొన్నారు. అయితే, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన దగ్గర స్పష్టమైన హామీలు లేకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ ప్లెక్సీల తొలగింపు.. ఇక యుద్ధమే!

చర్చలు ముగిసిన వెంటనే జీవన్‌రెడ్డి నివాసంపై ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలను ఆయన అభిమానులు, కార్యకర్తలు తొలగించారు. ఇది పార్టీతో తెగతెంపులకు సంకేతంగా కనిపిస్తోంది. “స్వపక్షంతో యుద్ధం నేను చేయలేను. ఇది పరిష్కారం లేని సమస్యగా మారింది” అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

నేడు (బుధవారం) 10 గంటలకు కార్యకర్తలతో భేటీ : Jeevan Reddy

తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి జీవన్‌రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు జగిత్యాలలోని బండారి గార్డెన్స్‌లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే ఆయన కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసి, తన తదుపరి పయనాన్ని ప్రకటించే అవకాశం ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?