ఐదుగురు దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు
Jharkhand : అమ్మాయిలపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఓ వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా జార్ఖండ్ లో అదే తరహా ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జార్ఘండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసముంటోంది. ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సోమవారం పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించామని పోలీస్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పుష్కర్ తెలిపారు. మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. అలానే నిందితులపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రతు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అధికారి రాం నారాయణ్ సింగ్ తెలిపారు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    