Job Mela 2025 : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ,(టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్ ) 25 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువతి యువకులకు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.15,000 నుంచి రూ.25,000 వేలవరకు వేతనం అందించనున్నారు. ఈ టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్స్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు HR (Ph.No.7799884996, 7799464344) ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో,(UEI&GB /MCC )వద్ద నేరుగా నవంబర్ 22 ,2025 న హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హతలు
- B.Tech (Mechanical)
- డిప్లొమా (Mechanical / Automobile)
- ITI – డీజిల్ మెకానికల్
- డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు
వయసు పరిమితి
- 18 నుండి 30 సంవత్సరాలు
వేతనం
- నెలకు ₹15,000 నుండి ₹25,000 వరకు
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు వారి:
- విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు
- ఇతర అవసరమైన పత్రాలతో
నవంబర్ 22, 2025 న నేరుగా
ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో హాజరు కావాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







