Sarkar Live

Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌),

Jubilee Hills ByElection Exit Polls

Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్యనే జరిగింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు.

ఇక గెలుపెవరిదన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌కు బ‌లాన్నిస్తున్నాయి. వివిధ సర్వేల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే
కాంగ్రెస్‌కు 46%, బీఆర్‌ఎస్‌కు 43%, బీజేపీకి 6% ఓట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.

హెచ్‌ఎంఆర్‌ సర్వే
కాంగ్రెస్‌కు 48.3%, బీఆర్‌ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు దక్కుతాయని తెలిపింది.

స్మార్ట్‌ పోల్స్‌ సర్వే
కాంగ్రెస్‌ 48.2%, బీఆర్‌ఎస్‌ 42.1%, బీజేపీ 7.6%, ఇతరులకు 2.1% ఓట్లు రావచ్చని తెలిపింది.

మొత్తం సర్వేలను బ‌ట్టి కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని, జూబ్లీహిల్స్‌ సీటు గెలుపు ఖాయమని కాంగ్రెస్‌ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కాగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. బీఆర్‌ఎస్‌ తరఫున ఆయన భార్య మాగంటి సునీత, కాంగ్రెస్‌ తరఫున నవీన్‌ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి బ‌రిలో నిలిచారు. అయితే ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ప్రతి పార్టీ త‌మ‌ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. చివరికి ఓటర్లు ఎవరికి తీర్పు ఇస్తారన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెల‌కొంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?