Exit Polls | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), బీజేపీ మధ్యనే జరిగింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఇక గెలుపెవరిదన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్‌కు బలాన్నిస్తున్నాయి. వివిధ సర్వేల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వేకాంగ్రెస్‌కు 46%, బీఆర్‌ఎస్‌కు 43%, బీజేపీకి 6% ఓట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.
హెచ్‌ఎంఆర్ సర్వేకాంగ్రెస్‌కు 48.3%, బీఆర్‌ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు దక్కుతాయని తెలిపింది.
స్మార్ట్ పోల్స్ సర్వేకాంగ్రెస్ 48.2%, బీఆర్‌ఎస్ 42.1%, బీజేపీ 7.6%, ...



