Sarkar Live

Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌

Jubilee Hills by-election
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు
  • ఎగ్జిట్‌ పోల్స్‌ ఊపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం

Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్‌ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్‌ లీడర్లను నియోజకవర్గంలో క‌లియ‌దిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ సెగ రేపింది.

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం

అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపించడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. చాణక్య, హెచ్‌ఎంఆర్‌, స్మార్ట్‌ పోల్స్‌ సర్వేలు అన్ని కాంగ్రెస్‌కే ఎక్కువగా ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ బీఆర్‌ఎస్‌ మాత్రం “సైలెంట్‌ ఓటర్లు” తమకే అనుకూలంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Jubilee Hills : ఒంటి గంట‌లోపే పూర్తి ఫ‌లితం

కాగా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఓట్ల లెక్కింపున‌కు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో 42 టేబుళ్లపై లెక్కింపు జరగనుంది. ఉదయం 8.45 గంటలకల్లా తొలి రౌండ్‌ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపే తుది ఫలితం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికలో మొత్తం 4.01 లక్షల ఓటర్లలో 1,94,631 మంది మాత్రమే ఓటు వేశారు. మొత్తం పోలింగ్‌ శాతం 48.49%. బస్తీ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనగా, అపార్ట్‌మెంట్‌ ప్రాంతాల్లో మాత్రం వోటింగ్‌ తక్కువగా నమోదైంది. వోటింగ్‌ శాతం తక్కువగా నమోదుకావడానికి ఉద్యోగులకు సెలవులు లేకపోవడం, పోలింగ్‌ ప్రచార లోపం, రాజకీయ పార్టీల చురుకుదనం తగ్గడం కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రేపు వెలువడే ఫలితం జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?