8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం..
Jubilee Hills Bypoll Results Live | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ ఆయనే ఆధిక్యంలోకొనసాగుతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 23వేల ఓట్లకు పైగా లీడ్‌లో ఉన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 43, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ (BJP) అభ్యర్థి దీపక్‌రెడ్డికి 20 ఓట్లు లభించాయి. 8వ రౌండ్ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 21,495 ఓట్ల ఆధిక్యం కైవసం చేసుకుంది.







