విశ్వనటుడు కమల్ హాసన్, మణిరత్నం (Kamal Hassan, Mani Ratnam combo)కాంబోలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వస్తున్న మూవీ థగ్ లైఫ్ (Thug Life) . ఈ మూవీ పై ఆడియన్స్ లో మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు (Nayakudu) మూవీ సూపర్ హిట్టు అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరిన్ని మూవీస్ వస్తాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరుగలేదు. ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు ఫుల్ బిజీ అయ్యారు.
ఇక పొన్నియ న్ సెల్వ న్ మూవీ కి ముందు మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన మూవీస్ కొన్ని తన రేంజ్ లో సరిగ్గా ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయాయి. మధ్యలో దుల్కర్ సల్మాన్ (Dulkar Salman)తో తీసిన ఒకే బంగారం మూవీ తీసి ఒకే అనిపించుకున్న భారీ హిట్టు కొట్టక చాలా కాలం అయిపోయింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ 1, 2 మూవీస్ తో మణిరత్నం బౌన్స్ బ్యాక్ అయ్యాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్ళు రాబట్టింది.
Thug Life : జూన్ 5న గ్రాండ్ రిలీజ్…
ఈ మూవీ తర్వాత కమల్ హాసన్ తో మూవీ ప్లాన్ చేశాడు. కథ చెప్పడం.. ఒకే అవ్వడం..సెట్స్ పైకి వెళ్ళడం చకచక జరిగిపోయాయి. ఈ మూవీ నుండి మొదట కమల్ హాసన్ గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గ్యాబ్ ఇవ్వకుండా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ట్రైలర్ లో చూసినట్టు గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది. శింబు (simbu), కమల్ హాసన్ విడిపోయి శత్రువులుగా మారినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ఇక ఏ ఆర్ రెహమాన్ మణిరత్నం కాంబోలో వచ్చిన మూవీస్ అన్నింటిలో ఎలాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడో మనకు తెలుసు. ఇప్పటికీ కూడా ఆ సాంగ్స్ మారుమోగిపోతుంటాయి. ఈ మూవీలో కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు.ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి సింగిల్ అదరగొట్టేసింది.
అదరగొడుతున్న షుగర్ బేబీ సాంగ్ ..
త్రిషపై(thrisha)తీసిన రెండో సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ షుగర్ బేబీ సాంగ్ కి అనంత శ్రీరామ్(Anantha sriram)లిరిక్స్ అందించగా నకుల్ అభ్యంకర్, శుభ, అలెగ్జాండర్ జాన్ పాడారు. యూత్ లో జోష్ నింపే విధంగా ఈ సాంగ్ ను క్రియేట్ చేశారు అనడంలో సందేహం లేదు. ఈనెల 24న గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఫంక్షన్ కూడా మూవీ టీం ప్లాన్ చేసింది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ , రెడ్ జైంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో జూన్ 5న రిలీజ్ అవుతున్న ఈ మూవీ మరో సంచలనం అవుతుందని కమల్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. నాయకుడు మూవీని మించి ఈ మూవీ మరో కొన్ని ఏళ్లపాటు ఆడియన్స్ కి గుర్తుండిపోతుందని సంబరపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.