Khammam waira sub registrar suspended : నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ (Registrations)లు చేయటంతో సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులుత్వరలోనే మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారంఒకే రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది.అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ లు చేసిన విషయం అదీ 90 కి పైగా డాక్యుమెంట్లు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
పైరవీల ఒత్తిడో లేక అమ్యామ్యాలకు తలొగ్గాడో తెలియదు కానీ ఆ రిజిస్ట్రేషన్ లే సదరు అధికారి కొంపముంచాయి.నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినందుకు గాను సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు పడింది.వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ ఇటీవలే స్టాంప్స్&రిగిస్ట్రేషన్స్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా 90 కి పైగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన విషయం బయటపడటంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు కాసేపటిక్రితమే వైరా సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
అయితే వైరా సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) సస్పెన్షన్ తో మరికొంతమంది అవినీతి అధికారుల్లో సస్పెన్షన్ గుబులు పట్టుకుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలోనే నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసిన మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..