Krishna water Dispute Hearing : కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (BRIJESH KUMAR TRIBUNAL) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని ట్రిబ్యూనల్ వెల్లడించింది. ముందుగా 811 టీఎంసీల్లో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాను ముందే తేల్చాల్సిన అవసరముందని ట్రైబ్యునల్ తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు రెండు రాష్ట్రాల వాదనలు వింటామని ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేలుస్తామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెల్లడించింది.
Krishna water Dispute Hearing : కాగా తాజా పరిణామంపై తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (UTTAM KUMAR REDDY) స్పందించారు. దిల్లీలో ఆయనమీడియాతో మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందన్నారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని, బచావత్ ట్రైబ్యునల్ ఎన్ బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని మంత్రి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..