Sarkar Live

L2 Empuran | ఎల్ -2 : ఎంపురాన్ మూవీ రివ్యూ…

L2 Empuran Movie Review | మోహన్ లాల్ (Mohan lal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమార న్ (Pruthvi Raj Sukumaran) డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ (lusifhar) ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మలయాళం తో పాటు తెలుగులో కూడా

L2 Empuran Movie Review

L2 Empuran Movie Review | మోహన్ లాల్ (Mohan lal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమార న్ (Pruthvi Raj Sukumaran) డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ (lusifhar) ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మలయాళం తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమార న్ డైరెక్షన్ లోనే లూసిఫర్ సీక్వెల్ మూవీ ఎల్ -2 ఎంపురాన్ (L2: Empuran) గా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….

ఇదీ స్టోరీ …

L2 Empuran Story : కేరళ సీఎం పీకే రామదాస్ చనిపోయిన తర్వాత పార్టీలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అతడి అల్లుడు బిమల్ కొందరు దుర్మార్గపు శక్తులతో చేతులు కలుపుతాడు.అతడి ఆగడాలు సాగకుండా రామ్ దాస్ పెంపుడు కొడుకుగా పెరిగిన స్టీఫెన్… రాందాస్ కొడుకైన జెతిన్ ను రాజకీయాల్లో దింపుతాడు. అతడి చేతుల్లోకి పార్టీ సురక్షితంగా ఉంటుందని నమ్మి స్టీఫెన్ అజ్ఞాతం లోకి వెళ్తాడు. ఇది మొదటి పార్ట్ గా తెరకెక్కి సూపర్ హిట్టు అయింది.

ఇక ఈ స్టోరీ కి కొనసాగింపుగా..

జెతిన్ పార్టీ ని బాగా నడిపిస్తాడనుకుంటే తప్పుడు దారిని ఎంచుకుంటాడు. పార్టీ నుండి బయటికి వచ్చి వేరే పార్టీ లో చేరాలనుకుంటాడు. జతిన్ అక్క ప్రియ అతడిని కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తుంది. మళ్ళీ ఏదో ప్రమాదం ఉందని తెలిసి స్టీఫెన్ మళ్ళీ వచ్చాడా..? జెతిన్ వేరే పార్టీ కి వెళితే అసలు ఏం జరుగుతుంది. అజ్ఞాతంలో ఖురేషి అబ్రహం పేరుతో స్టీఫెన్ ఎందుకుండాల్సి వచ్చింది..? అనేది మూవీ…

L2 Empuran Movie Review : మూవీ ఎలా ఉందంటే..

ఫస్ట్ ఆఫ్ లో హీరో ఎంట్రీ మూవీ మొదలైన 40 నిమిషాల తర్వాత ఉండడం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. అతడి ఎంట్రీ ఇంకెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అప్పటి వరకు జరిగే స్టోరీ బోర్ కొట్టకుండా ఉన్న కూడా ఆ సీన్ లను సాగదీశారనిపిస్తుంది. స్లో నేరేషన్ తో పాటు హీరో మరీ అంత లేటుగా ఎంట్రీ ఇవ్వడం మైనస్ గా మారిందని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ సీన్ తో ఇంటర్వెల్ ని ఎండ్ చేయడం బాగుంటుంది. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్న ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ వస్తుంది. ప్రతీ సారి హీరో ఎలివేషన్ ఎక్కువగా ఇస్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. హీరో కు ఎదురుగా బలమైన విలన్ లేనట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల హీరో పాత్ర జనాలకి మాములుగా అనిపిస్తుంది.ఏ సిట్చువేషన్ అయినా హీరో ఈజీ గా హ్యాండిల్ చేస్తాడని అనిపిస్తుంది.

నటీ నటులు ఎవరెలా చేశారు..

మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పేదేముంది తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో యాక్టింగ్ ఇరగదీశాడు.యాక్షన్ సీక్వెన్స్ లో దుమ్ము దులిపాడని చెప్పొచ్చు. స్క్రీన్ టైమ్ తక్కువ గా ఉన్నట్టే కానీ కనబడ్డప్పుడల్లా విజిల్స్ మోగుతూనే ఉంటాయి. మంజు వారియర్ క్యారక్టర్ అద్భుతంగా ఉంటుంది. మంచి స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక టోవినో థామస్ కూడా విలన్ షేడ్ లో మంచి పర్ఫామెన్స్ కనబర్చారు.పృథ్వీ రాజ్ సుకుమార న్ పాత్ర కొద్దిసేపే ఉన్న ఆకట్టుకున్నాడు. మిగితా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు..

L2 Empuran Movie Review : నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. మంచి మంచి లోకేషన్స్ లో ఖర్చుకు కాంప్రమైజ్ అవకుండా మూవీని తీశారు.సుజీత్ వాసుదేవ్ కెమెరా పనితనం, దీపక్ దేవ్ బీజీయేం పర్వాలేదనిపిస్తుంది.డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార న్ మూవీ ని తెరకెక్కించడం లో తడబడకున్న లూసిఫర్ తీసినంత ఇంట్రెస్టింగ్ గా రెండవ భాగాన్ని తేయలేదని అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ సాగదీయడంతో ప్రేక్షకున్ని అసహనానికి గురిచేసింది. స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అయ్యుండేదని అనిపించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మొదటి భాగం తో పోల్చుకుంటే జస్ట్ ఓకే అనిపించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!