life sciences economy : జీవ విజ్ఞాన రంగంలో హైదరాబాద్ నగరం (Hyderabad) దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహమ్మారులకు వ్యాక్సిన్ అందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. భారతదేశ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ పేరు తెచ్చుకొంది.
life sciences economy : రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు
జీవ విజ్ఞాన రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలవడం రాష్ట్ర (Telangana) అభివృద్ధికి దోహదం చేసిందని అన్నారు ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు (IT minister D Sridhar Babu). తద్వారా రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల (investments)ను రాష్ట్రం ఆకర్షించిందని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏసియా (BioAsia) సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దేశ జీవ విజ్ఞాన ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్ ప్రస్తుతం జీవ విజ్ఞాన రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశ జీవ విజ్ఞాన ఆర్థిక కేంద్రం (life sciences economy)గా ఈ నగరం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహమ్మారులకు వ్యాక్సిన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ భారతదేశ వ్యాక్సిన్ రాజధాని (vaccine capital of India)గా పేరు తెచ్చుకోవడంతో విశేష గుర్తింపు తెచ్చుకొంది. ప్రత్యేకంగా కరోనా సమయంలో భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, బయోకాన్ వంటి సంస్థలు హైదరాబాద్ నుంచే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను సరఫరా చేశాయి. అంతేకాదు.. ఐటీ రంగంలోనూ హైదరాబాద్ విశేష అభివృద్ధి సాధించింది. నగరం నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ సేవలు ప్రపంచానికి అందుతున్నాయి. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద సంస్థలు తమ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
ఫార్మాస్యూటికల్ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యత
తెలంగాణ రాజధాని భారతదేశ ఔషధ (pharmaceutical) పరిశ్రమలో 15 శాతం ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అంతేకాదు.. దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. దీని వల్ల దేశానికి మిగతా రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్ ఔషధ రంగంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
జీనోమ్ వ్యాలీ – బయోటెక్నాలజీ హబ్
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ ప్రస్తుతం బయోటెక్నాలజీ పరిశోధనల ప్రధాన కేంద్రంగా మారింది. జీవ విజ్ఞాన పరిశోధనకు సంబంధించి ఎన్నో సంస్థలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ 2024లో Genome Valleyలో ఏర్పాటయ్యింది. దీని వల్ల ప్రయోగశాల పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..