హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది.
కోల్కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లారు .ఫలక్నుమా ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫలక్నుమా ప్యాలెస్లో నిర్వహించిన ‘మీట్-అండ్-గ్రీట్’ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు.
ఉప్పల్లో రేవంత్ సింగరేణి టీమ్ విజయం
మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ ‘మెస్సీ అపర్ణ’ జట్టు, ‘రేవంత్ సింగరేణి’ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సింగరేణి టీమ్ విజయం సాధించగా, మెస్సీ అపర్ణ జట్టు రన్నరప్గా నిలిచింది.
రేవంత్ గోల్: మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి ప్రేక్షకులను అలరించారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో కూడా ఆయన గోల్ సాధించారు. మెస్సీ గోల్స్: పెనాల్టీ షూటౌట్లో మెస్సీ కూడా రెండు గోల్స్ కొట్టి సందడి చేశారు.
మనవడితో Lionel Messi ఫుట్బాల్
మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటగాళ్లతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన మనవడిని గ్రౌండ్లోకి తీసుకొచ్చి మెస్సీకి పరిచయం చేశారు. మెస్సీ, సీఎం రేవంత్ మనవడితో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి మెస్సీతో ఫొటో దిగారు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ కూడా మ్యాచ్ అనంతరం మెస్సీతో కలిసి ఫొటో దిగారు. చివరగా, తన కోసం వచ్చిన ప్రేక్షకులకు స్టేడియం చుట్టూ తిరుగుతూ మెస్సీ అభివాదం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







