Sarkar Live

Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో

Lioness jumps onto tourists | సింహాన్ని చూడ‌గానే అంద‌రూ హ‌డ‌లెత్తిపోతారు.. క‌నీసం దాని అరుపు విన్నా ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ప‌రుగులు ల‌ఘించుకుంటారు.. అయితే అడవి జంతువులు కూడా ప్రేమను ఆప్యాయతను కోరుకుంటాయి! క్రూర మృగాలు కూడా ఒక్కోసారి ఊహించ‌ని విధంగా

Lioness jumps onto tourists

Lioness jumps onto tourists | సింహాన్ని చూడ‌గానే అంద‌రూ హ‌డ‌లెత్తిపోతారు.. క‌నీసం దాని అరుపు విన్నా ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ప‌రుగులు ల‌ఘించుకుంటారు.. అయితే అడవి జంతువులు కూడా ప్రేమను ఆప్యాయతను కోరుకుంటాయి! క్రూర మృగాలు కూడా ఒక్కోసారి ఊహించ‌ని విధంగా పెంపుడు జంతువు లాగా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఒక సంఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఒక్క‌సారిగా ప‌ర్యాట‌కుల వాహ‌నంలోకి ప్ర‌వేశించి మ‌నుషుల ఒడిలోకి ఎక్కి ఆప్యాయంగా స్పృషించింది.

అడవి రాణికి అయిన ఓ సింహం (Lioness) వాహనంలోకి దూకి జనంతో ఆడుకుంటూ కనిపించింది. ఆఫ్రికన్ సఫారీ పార్క్‌ (African safari park)లో చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో క్ష‌ణాల్లోనే ఇంట‌ర్నెట్‌లో నెటిజ‌న్ల మ‌స‌సును దోచుకుంది. ‘నేచర్ ఈజ్ అమేజింగ్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 39 మిలియన్ల మంది వీక్షించారు.

Lioness jumps onto tourists Video : వైరల్ వీడియోలో, పర్యాటకుల బృందం ఓపెన్ సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అకస్మాత్తుగా, ఒక భారీ సింహం వాహనంతో పాటు నడవడం ప్రారంభించింది. ఎవరూ స్పందించకముందే, అది వాహనంపైకి దూసుకెళ్లి, ప్రయాణీకుల ఒడిలోకి చేరింది.వెనుకవైపు ముందుకు క‌దులుతూ స్వేచ్ఛ‌గా వెళ్లింది. ఊహించని ఘటనతో కొందరు ప్రయాణికులు కేకలు వేశారు. అయితే ఆ సింహం ఎవరిపైనా దాడి చేయకుండా పర్యాటకుల మెడలు, తలలపై తన తలల‌తో ఆప్యాయంగా రుద్దడం ప్రారంభించింది. ప్రయాణీకులు సింహాన్ని తలను, శరీరాన్ని నిమురుతూ రెస్పాండ్ అయ్యారు. వీడియో చివరలో మరొక భారీ సింహం వేరొక వాహనంపైకి ఎక్కి, దాని తలను ప్రయాణీకుల ఒడిలోకి లాక్కొని, ఆప్యాయతను కోరుతున్నట్లు కనిపిస్తుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?