Sarkar Live

Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్

హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local body election) నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న నాన్చుడు ధోర‌ణిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) త‌ప్పు ప‌ట్టింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు అల‌స‌త్వం వ‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. ఈనెల 21లోగా త‌ప్ప‌నిస‌రిగా

Gram panchayat elections

హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local body election) నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న నాన్చుడు ధోర‌ణిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) త‌ప్పు ప‌ట్టింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు అల‌స‌త్వం వ‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. ఈనెల 21లోగా త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక‌ల షెడ్యూల్ (schedule)ను ప్ర‌క‌టించాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

Local body election : స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌

శుక్రవారం జరిగిన విచారణ సంద‌ర్భంగా హైకోర్టు ఘాటుగానే స్పందించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local body election) ఇంకా ఆల‌స్యం చేయొద్ద‌ని ప్రభుత్వం (state government), రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించింది. ఈ ఎన్నిక‌ల‌ను ఇలాగే నిరవధికంగా వాయిదా వేస్తూ కాల‌యాప‌న చేస్తే చ‌ట్టం అనుమతి ఇవ్వబోదని పేర్కొంది.

6 నెలల్లో తప్పనిసరి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో హైకోర్టు (Telangana High Court) త‌న వ్యాఖ్య‌ల్లో ఒక ముఖ్యమైన విష‌యాన్ని గుర్తు చేసింది. పంచాయతీ పదవీకాలం ముగిసిన తర్వాత గరిష్టంగా ఆరు నెలల్లోపే ఎన్నికలు జరగాలని, దీన్ని ఆల‌స్యం చేయ‌డానికి నిర్దిష్ట‌మైన కార‌ణం అంటూ ఉండాల‌ని తేల్చిచెప్పింది. BC రిజర్వేషన్ల సమస్యను కారణంగా ప్ర‌భుత్వం చూపుతున్నా ఆ అంశం మొత్తం ఎన్నికలను నిలిపివేయడానికి కార‌ణం కాకూడ‌ద‌ని బెంచ్ స్పష్టం చేసింది.

BC రిజర్వేషన్లపై వివాదమే కార‌ణం : ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు కోర్టుకు ప‌లు విష‌యాలు వివ‌రించారు. కొన్ని గ్రామాల్లో BC రిజర్వేషన్స్‌ ( BC reservations)పై అభ్యంతరాలు ఉన్నాయ‌ని, వాటిపై దాఖలైన పిటిషన్లను పరిశీలించాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ వివాదంలో స్పష్టత వచ్చేవరకు ఎన్నికలు పెట్టడం కష్టమ‌ని చెప్పారు. అడ్వ‌కేట్లు ఇచ్చిన ఈ వివ‌ర‌ణపై హైకోర్టు (Telangana High Court) అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రిజర్వేషన్ సమస్య ఉన్న గ్రామాల్లో స్ప‌ష్ట‌త‌ రావాలి గానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను నిలిపివేయ‌డం సరైన పద్ధతి కాదని అభిప్రాయ‌ప‌డింది.

SEC ప్ర‌తిపాద‌న‌పై High Court అసంతృప్తి

విచారణ సమయంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ( State Election Commission (SEC) ఒక ప్రతిపాదనను కోర్టులో ఉంచింది. BC రిజర్వేషన్లపై వివాదం లేని గ్రామాల్లో ముందుగా ఎన్నికలు నిర్వ‌హించి, వివాదాస్పద గ్రామాల్లో త‌ర్వాత నిర్వ‌హిస్తే స‌మ‌స్య ఉండ‌బోద‌ని అంది. దీనిపై హైకోర్టు (Telangana High Court) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామాలను విడదీసి దశలవారీగా (phases ) ఎన్నికలు నిర్వహించడం సరికాదని అంది. ఎన్నికలు ఒకటి రెండు గ్రామాలకే కాకుండా అన్నిటికీ ఒకే షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గాల‌ని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విభజన స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డింది.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?