Sarkar Live

LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు

LPG Price Hike : డిసెంబర్ నెల మొదటి రోజే ప్రజలు షాక్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల

LPG Price Hike

LPG Price Hike : డిసెంబర్ నెల మొదటి రోజే ప్రజలు షాక్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధ‌ర స్వ‌ల్పంగా పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ.1818.50 కు పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 ఎగ‌బాకింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రేట్లు ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచే అమల్లోకి వొచ్చాయి.

దేశీయ LPG సిలిండర్ ధరలు

గృహ వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌లిగించేలా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెర‌గ‌లేదు. చమురు కంపెనీలు వీటి ధరలను పెంచక‌పోవ‌డం విశేషం. చివరగా జూలైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో ఆగస్టు తర్వాత అప్పటి నుంచి నేటి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్‌ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఈరోజు పాట్నాలో రూ. 892.50గా ఉంది. అదే సమయంలో ఢిల్లీలో 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.803కే విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్‌లో రూ. 855, విజయవాడలో రూ. 818.50గా ఉన్నాయి.

వాణిజ్య సిలిండర్లు ఏ నగరాల్లో ఎంత రేటుకు అందుబాటులో ఉన్నాయి?

ఇక వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు కోల్‌కతాలో రూ. 1927కి చేరింది. ఇది నవంబర్‌లో కేవలం రూ.1911.50గా ఉండేది. ముంబైలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.50 పెరిగింది. ఇక్కడ రూ.1754.50కి లభించే సిలిండర్ నేటి నుంచి రూ.1771కి అందుబాటులోకి రానుంది.

వాణిజ్య సిలిండర్ పాట్నాలో రూ. 2072.5 ధరకు అందుబాటులో ఉంటుంది. చెన్నైలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1980.50 గా ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.61 పెరిగి రూ. 2028కి పెరిగింది. విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు రూ.1962కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!