Sarkar Live

RTO corruption | మహబూబాబాద్‌లో లంచాలు మ‌రీ కాస్ట్లీ

Mahaboobabad RTO corruption : ఆ కార్యాలయంలో లంచాలు చాలా కాస్ట్లీగా ఉంటాయట. కార్యాలయంలో ఏ సేవలైన సాఫీగా సాగాలంటే సదరు కార్యాలయ ఉన్నతాధికారి ఫిక్స్ చేసిన మామూళ్లు(లంచాలు) పరోక్షంగా చెల్లించక తప్పదని జిల్లా వ్యాప్తంగా వాహనదారులు కోడైకూస్తుండడంతో సదరు అధికారుల

Mahaboobabad RTO corruption
  • ప్రభుత్వ ఫీజు గోరంత.. మామూళ్లు కొండంత..
  • లంచాల లావాదేవీలకు ఐదుగురే కింగ్ పిన్లు
  • డీటీవో, ఏఎంవీఐలను “సంతోష” పెడుతున్న ఉద్యోగి

Mahaboobabad RTO corruption : ఆ కార్యాలయంలో లంచాలు చాలా కాస్ట్లీగా ఉంటాయట. కార్యాలయంలో ఏ సేవలైన సాఫీగా సాగాలంటే సదరు కార్యాలయ ఉన్నతాధికారి ఫిక్స్ చేసిన మామూళ్లు(లంచాలు) పరోక్షంగా చెల్లించక తప్పదని జిల్లా వ్యాప్తంగా వాహనదారులు కోడైకూస్తుండడంతో సదరు అధికారుల వ్యవహారం ఇప్పుడు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.ఆ రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఫీజుల కంటే సంబంధిత అధికారులకు ఇచ్చే మామూళ్లే ఎక్కువ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ ఫీజు గోరంత ఉంటే మామూళ్లు (Bribes) కొండంత ఉంటాయని మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళిన వాహనదారులు బహిరంగంగా నే మాట్లాడుకోవడం గమనార్హం.

RTO corruption : లంచాల లావాదేవీకి ఐదుగురే ‘కింగ్‌పిన్లు’

మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు తీసుకుంటున్న లంచాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లంచాల లావాదేవీలకు ఆ ఐదుగురు బడా ఏజెంట్ లే కింగ్ పిన్లు గా ఉన్నారని సమాచారం. కార్యాలయంలో ఏ ఫైలు కదలాలన్నా సదరు ఐదుగురి బడా ఏజెంట్ ల ద్వారానే కదులుతున్నట్లు తెలుస్తోంది. వాహనదారులకు కార్యాలయంలో ఏ పని కావాలన్న ఏజెంట్ లను సంప్రదించటం, వారు అడిగింది సమర్పించడం బహిరంగంగా కనపడుతున్నప్పటికి,అసలు రహస్యం ఆ ఐదుగురు కార్యాలయంలోనికి పంపే మెసేజ్ లలోనే ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది.కార్యాలయం వెలుపల ఉండే ఏజెంట్లందరికి ఈ ఐదుగురు బడా ఏజెంట్ లే సుప్రీం అని వీరి ద్వారా వెళ్తే మాత్రమే ఫైళ్లకు మోక్షం ఉంటుందని ఏజెంట్ లు సైతం బహిరంగంగా మాట్లాడుకోవడం కొసమెరుపు. వాహనదారుల నుండి అలాగే చోటా మోటా ఏజెంట్ లనుండి ఈ ఐదుగురు బడా ఏజెంట్ లు లంచాల (RTO corruption) రూపంలో వసూళ్లు చేసిన మొత్తాన్ని సాయంత్రం అధికారులు చెప్పిన వ్యక్తులకు పువ్వుల్లో పెట్టి మరీ అప్పగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అధికారులను “సంతోష” పెడుతున్న ఉద్యోగి

మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయం (Mahaboobabad RTO Office) లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులతోపాటు, మిగిలిన ఉద్యోగులందరిని “సంతోష”పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్యాలయ పరిధిలో ఉన్న ఏజెంట్లకు పెద్ద దిక్కుగా మారిన సదరు ఉద్యోగి అటు ఏజెంట్లకు లీడర్లు గా ఉన్న ఐదుగురు పెద్ద ఏజెంట్లకు, ఇటు డిటివో, ఏఎంవీఐ లతో పాటు మిగిలిన ఉద్యోగులకు మధ్య పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరిని “సంతోష’ పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏజెంట్లకు లీడర్లుగా కొనసాగుతున్న సదరు ఐదుగురు బడా ఏజెంట్ల నుండి ఆ ఫోన్కు మెసేజ్ రాగానే ఫైళ్లు అప్రూవ్ అయ్యేటట్టు చూసుకునే సదరు ఉద్యోగి అటు ఏజెంట్లకు ఇటు మిగిలిన స్టాఫ్ కు మధ్యవర్తిగా కొనసాగుతూ ఏజెంట్లతోపాటు అధికారులను సంతోషపెడుతున్నట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏ సర్వీస్ కు ఎంత వసూళ్లు చేస్తున్నారు అనేది ఈ క్రింద పట్టికలో చూడచ్చు..

లైసెన్స్ కేటగిరీ

సర్వీస్ప్రభుత్వ ఫీజులంచం
లెర్నింగ్ లైసెన్స్ కురూ.550ఎంవీఐకి రూ. 900
క్లర్క్ కు రూ.100
పర్మినెంట్ లైసెన్స్రూ.1435ఎంవీఐ రూ.1500
హెవీ లైసెన్స్రూ.1700ఎంవీఐకి రూ.3300
ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్రూ.1435ఎంవీఐకి రూ.2100

కొత్త వాహన రిజిస్ట్రేషన్లు

సర్వీస్ప్రభుత్వ ఫీజులంచం
టూ వీలర్లేదుఎంవీఐకి రూ.250
ఏవోకు రూ.100
క్లర్క్ కు రూ.100
కార్లులేదుఎంవీఐకి రూ.600
ఏవోకు రూ.200
క్లర్క్ కు రూ.200
త్రీవీలర్ & ఆటో రిక్షా ప్యాసింజర్లేదుడీటీవోకు రూ.2000
ఎంవీఐకి రూ.600
ఏవోకు రూ.200
క్లర్క్ కు రూ.200
ఎల్ఎంవీ గూడ్స్లేదుడీటీవోకు రూ.200
ఎంవీఐకి రూ.1200
ఏవోకు రూ.200
క్లర్క్ కు రూ.200
ట్రాక్టర్ ట్రాలీలేదుడీటీవోకు రూ.800
ఎంవీఐకి రూ.1500
ఏవోకు రూ.300
క్లర్క్ కు రూ.300
మోటార్ క్యాబ్లేదుడీటీవోకు రూ.2200
ఎంవీఐకి రూ.1400
ఏవోకు రూ.500
క్లర్క్ కు రూ.500
మీడియం గూడ్స్ వెహికిల్లేదుడీటీవోకు రూ.2200
ఎంవీఐకి రూ.2200
ఏవోకు రూ.500
క్లర్క్ కు రూ.500
హెవీ గూడ్స్ వెహికిల్లేదుడీటీవోకు రూ.3200
ఎంవీఐకి రూ.5500
ఏవోకు రూ.1000
క్లర్క్ కు రూ.1000
జెసిబిలేదుడీటీవోకు రూ.2200
ఎంవీఐకి రూ.2400
ఏవోకు రూ.500
క్లర్క్ కు రూ.500
హార్వెస్టర్లేదుడీటీవోకు రూ.5500
ఎంవీఐకి రూ.2400
ఏవోకు రూ.1000
క్లర్క్ కు రూ.1000

ఫిట్ నెస్

సర్వీస్ప్రభుత్వ ఫీజులంచం
ఆటో రిక్షారూ.700
ఎంవీఐకి రూ.400
క్లర్క్ కు రూ.100
ఎల్ఎంవీ గూడ్స్రూ.900ఎంవీఐకి రూ.1000
క్లర్క్ కు రూ.100
ట్రాక్టర్, ట్రాలీరూ.900ఎంవీఐకి రూ.1400
క్లర్క్ కు రూ.100
మోటార్ క్యాబ్రూ.900ఎంవీఐకి రూ.900
క్లర్క్ కు రూ.100
మీడియం గూడ్స్ వెహికిల్రూ.1100ఎంవీఐకి రూ.1800
క్లర్క్ కు రూ.100
హెవీ గూడ్స్ వెహికిల్రూ.1100ఎంవీఐకి రూ.2200
క్లర్క్ కు రూ.100

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?